శాస్త్ర అస్త్రాలతో...

International Day of Women and Girls in Science 2022 - Sakshi

నేడు ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ వుమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌

శాస్త్ర, సాంకేతిక రంగాలలో మహిళల ప్రాతినిధ్యం, వారి విజయాల గురించి తలచుకునే అవకాశం ఇస్తుంది.. ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ వుమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’ దినోత్సవం.

డా. ఏ.సీమ కేరళ త్రిసూర్‌లోని ‘సెంటర్‌ ఫర్‌ మెటీరియల్స్‌ ఫర్‌ ఎలక్ట్రానిక్స్‌ టెక్నాలజీ (సి–మెట్‌) విభాగంలో సైంటిస్ట్‌. ఒకసారి ఆమె ‘మలబార్‌ క్యాన్సర్‌ సెంటర్‌’కు వెళ్లినప్పుడు ఆ సంస్థ డైరెక్టర్‌ ‘బ్రెస్ట్‌ క్యాన్సర్‌’ గురించి తనతో కొంతసేపు మాట్లాడారు. ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పరీక్షలు చేయించుకోవడానికి మహిళలు చొరవ చూపకపోవడం వెనుక ఉన్న పరిమితులు తెలిశాయి.

ఈ నేపథ్యంలో సీమ తక్కువ ఖర్చుతో, సులభంగా ఉపయోగించగలిగే, ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లగలిగే బ్రెస్ట్‌ క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరికరాన్ని తయారు చేశారు. ఇలాంటి పరికరం దేశచరిత్రలోనే ప్రథమం. రేపటి విజయాల కోసం నిన్నటి విషయాలను గుర్తు చేసుకోవాలంటారు.

అలా ఒకసారి వెనక్కి వెళితే...
పాశ్చాత్య వైద్యవిద్యను అభ్యసించిన తొలి భారతీయ మహిళ ఆనంది బాయి, 1883లో ‘ఫస్ట్‌ ఫిమేల్‌ గ్రాడ్యుయేట్‌ ఇన్‌ మెడికల్‌ హిస్టరీ’ (ఇండియా)గా కాదంబినీ గంగూలీ చరిత్ర సృష్టించారు. సౌమ్య స్వామినాథన్‌.. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ డిప్యూటి డైరెక్టర్‌గా ప్రపంచాన్ని మెప్పించారు. రాయల్‌ సొసైటీకి ఎంపికైన తొలి మహిళగా గగన్‌దీప్‌ ఎంతోమంది యువతులకు స్ఫూర్తి ఇచ్చారు.

విజ్ఞాన్‌ ప్రసార్‌ ‘విజ్ఞాన్‌ విదూషి’ (ఇండియన్‌ వుమెన్‌ సైంటిస్ట్స్‌) పుస్తకం స్పేస్‌ సైన్సెస్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్‌ సైన్స్, న్యూరోసైన్స్, సైన్స్‌ అడ్మినిస్ట్రేషన్‌.. మొదలైన శాస్త్రీయరంగాల రోల్‌మోడల్స్‌గా చెప్పుకునే మహిళల గురించి చెప్పడమే కాదు, వారు ఎలాంటి పరిమితులు ఎదుర్కొన్నారు, వాటిని అధిగమించడానికి చేసిన కృషి గురించి చెప్పడం ఈ తరానికి స్ఫూర్తి ఇస్తుంది.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top