Meenakshi Seshadri: అరవైలోనూ ఇరవై! | Former Bollywood actress Meenakshi Seshadri stuns with classical dance routine | Sakshi
Sakshi News home page

Meenakshi Seshadri: అరవైలోనూ ఇరవై!

Jan 28 2024 12:30 AM | Updated on Jan 28 2024 12:30 AM

Former Bollywood actress Meenakshi Seshadri stuns with classical dance routine - Sakshi

నృత్యానికి వయసు అడ్డు కాదని మరోసారి నిరూపించింది మాజీ బాలీవుడ్‌ హీరోయిన్‌ మీనాక్షి శేషాద్రి. 60 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన క్లాసికల్‌ డ్యాన్స్‌ కొరియోగ్రఫీతో నెటిజనులను ఆకట్టుకుంది. ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేసిన ఈ డ్యాన్స్‌ వీడియో వైరల్‌ అయింది. క్లిష్టమైన ఫుట్‌వర్క్, హావభావాల వ్యక్తీకరణతో నెటిజనులను ఆకట్టుకుంది. ఆమె కాలాతీత అందం, క్లాసికల్‌ డాన్స్‌ పట్ల నిబద్ధతకు అభిమానులు సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

1980లలో హీరో, మేరీ జంగ్, దామినిలాంటి చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న మీనాక్షి బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పి భర్త, బిడ్డలతో అమెరికాలో స్థిరపడింది. అక్కడ ఒక డ్యాన్స్‌ స్కూల్‌ ప్రారంభించి భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను నేర్పించేది. ఆన్‌–స్క్రీన్‌ మీద కనిపించనప్పటికీ ఈ అందాల నటి సోషల్‌ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటోంది. ‘అప్పుడు–ఇప్పుడూ’ అనే కాప్షన్‌తో పాత, కొత్త ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement