శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..! | Bull Pounces On Scooter In Bengaluru Truck Driver Saves Rider, Shocking Video Goes Viral - Sakshi
Sakshi News home page

శివ..శివా..! క్షణం ఆలస్యమైతే.. ప్రాణాలే పోయేవి..!

Published Sat, Apr 6 2024 3:57 PM

Bull Pounces On Scooter In BengaluruTrucker driver Saves Rider - Sakshi

భూమ్మీద నూకలుంటే ఎలాంటి ప్రమాదం నుంచి అయినా ఇట్టే బయటపడవచ్చు. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.  దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట  తెగ వైరల్‌ అవుతోంది.  స్టోరీ ఏంటంటే..

బెంగళూరులోని మహాలక్ష్మీపురం లేఅవుట్ ప్రాంతంలో పెద్దగా హడావిడి లేకుండా, ప్రశాతంగా ఉంది. అయితే ఇరుకైన రోడ్డులో ఓ మహిళ ఒక ఎద్దును తోలుకుంటూ  వెడుతోంది. తాను ముందు పోతూ ఎద్దును తాడుతో  లాగుతోంది. ఇంతలో ఉన్నట్టుండి ఆ ఎద్దు వింతగా ప్రవర్తించింది. బైక్‌పై ఎదురుగా వస్తున్న వాహనదారుడి పైకి దూకింది.  

ఏదో పగ బట్టినట్టు, కావాలని చేసినట్టు అతడిపై లంఘించింది. ఈ హఠాత్మపరిణామానికి అదుపుతప్పిన అతడు ఎదురుగా వస్తున్న లారీ కిందకి దూసుకుపోయాడు. అయితే లారీ డ్రైవర్‌ ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా, ఎద్దు కదలికలను గమనించిన డ్రైవర్ వేసిన బ్రేక్‌ పనిచేయక పోయినా అతగాడి ప్రాణాలు గాల్లో కలిసి పోయేవే. అదృష్టవశవాత్తూ డ్రైవర్‌ అలర్ట్‌ అయి వాహనదారుడి ప్రాణాలను కాపాడాడు. ఈ దృశ్యాలు  సీసీటీవీలో రికార్డైనాయి. 

 
Advertisement
 
Advertisement