Arthritis Patients: నడక, సైక్లింగ్‌, నీళ్లలో ఏరోబిక్స్‌ చేస్తున్నారా.. ఇది మీ కోసమే!

Best Tips SMART To Arthritis Patients Get Muscle Strength In Telugu - Sakshi

ఆర్థరైటిస్‌ రోగులకు ఎముకల బలం కోసం స్మార్ట్‌ పద్ధతి! 

ఎస్‌ అంటే ‘స్టార్ట్‌ స్లో అండ్‌ గో స్లో : ఆర్థరైటిస్‌తో బాధపడేవారు డాక్టర్లు సూచించిన విధంగా తమకు అనువైన తేలికపాటి వ్యాయామాల్ని ప్రారంభించాలి. అతి మెల్లిగా మొదలు పెట్టి.. క్రమంగా పెంచుకుంటూ పోవాలి.  

ఎమ్‌ అంటే మాడిఫై యువర్‌ యాక్టివిటీ వెన్‌ ఆర్థరైటిస్‌ సింప్టమ్స్‌ ఇంక్రీజ్‌ : ఆర్థరైటిస్‌ లక్షణాల్లో ప్రధానమైనది కీళ్లనొప్పి. ఇది తరచూ వస్తూ పోతూ ఉంటుంది. నొప్పి వచ్చి, అది తీవ్రమైనప్పుడు బాధితులు చేసే ఆ వ్యాయామరీతులను వారి లక్షణాలకు తగ్గట్లుగా మార్చుకోవాలి. ఉదాహరణకు తీవ్రత పెరిగినప్పుడు వ్యాయామం చేసే వ్యవధినీ, వ్యాయామ తీవ్రతనూ తగ్గించుకోవాలి. దీనివల్ల నొప్పి మరింతగా పెరగకుండా చూసుకోవచ్చు. 

ఏ అంటే ఏక్టివిటీస్‌ షుడ్‌ బి జాయింట్‌ ఫ్రెండ్లీ: 
బాధితుల వ్యాయామాలు వారి కీళ్లకూ, కండరాలకు మరింత  మేలు చేసేలా ఉండాలి. ఉదాహరణకు వ్యాయామాల్లోని తేలికపాటివి... అంటే నడక, సైక్లింగ్, నీళ్లలో చేసేవి బాధితులకు శ్రమ ఎక్కువగా కలిగించవు. పైగా అవన్నీ చాలావరకు స్వాభావికమైనవే. నీళ్లలో వ్యాయామాలు చేయడం వల్ల కీళ్లపై పడే శరీర బరువు బాగా తగ్గుతుంది. అందువల్ల నీళ్లలో ఏరోబిక్స్‌ కీళ్లకు మేలు చేసేవిగా (జాయింట్‌ ఫ్రెండ్లీ)గా ఉంటాయన్నమాట. 

ఆర్‌ అంటే రికగ్నైజ్‌ సేఫ్‌ ప్లేసెస్‌ అండ్‌ వేస్‌ టు బి యాక్టివ్‌: ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో ఎముకలు పెళుసుబారి ఉంటాయి. అందుకే అవి చిన్నపాటి శ్రమకు కూడా విరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వ్యాయామం చేయడానికి సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం కూడా అవసరమే. ఉదాహరణకు పార్క్‌లో నడుస్తున్నప్పుడు... అక్కడి వాకింగ్‌ ట్రాక్‌ పగుళ్లు లేకుండా, స్లిప్‌ అవ్వడానికి అవకాశం లేకుండా సురక్షితంగా ఉండటం అవసరం.

అలాగే చుట్టుపక్కల పెద్ద బండరాళ్లు ఉన్న ప్రదేశమైతే.. పొరబాటున పడిపోతే తలకు బలమైన గాయాలయ్యే అవకాశం ఎక్కువ. అలాంటివేవీ లేని సమతల ప్రదేశంలోనే వ్యాయామం చేయాలి. ఒకవేళ కాస్తంత సాయం సమయంలో చీకటిపడ్డప్పుడు వాకింగ్‌ చేస్తుంటే, అక్కడ తగినంత లైట్ల వెలుతురు ఉండేలా చూసుకోవాలి. 

టీ అంటే టాక్‌ టు హెల్త్‌ ప్రొఫెషనల్‌ : చిన్నవయసు ఆరోగ్యవంతులు కాకుండా... మరెవరు(అంటే కీళ్లనొప్పులు, గుండెజబ్బులు... వంటివి ఉన్నవారు) వ్యాయామాలు ప్రారంభించినా... ముందుగా ఓసారి వ్యాయామ నిపుణుడితోపాటు డాక్టర్‌ (లైఫ్‌స్టైల్‌ నిపుణులు లేదా ఆర్థో / గుండె / ఫిజీషియన్‌)ను సంప్రదించి, తమకు తగిన వ్యాయామాలేమిటో తెలుసుకోవాలి. మరీ ముఖ్యంగా దీర్ఘకాలిక (క్రానిక్‌) వ్యాధులతో బాధపడేవారు ఎలాంటి వ్యాయామాలు చేయాలో నిపుణులు మాత్రమే సూచిస్తారు.

చదవండి: Badam Health Benefits: రాత్రంతా నీళ్లలో నానబెట్టి బాదం పొట్టు తీసి తింటున్నారా? వేటమాంసం తిన్న తర్వాత వీటిని తిన్నారంటే.. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top