Beauty Tips In Telugu: Rose Water And Aloe Vera Gel For Acne Free Face - Sakshi
Sakshi News home page

Beauty Tips: ముఖంపై మొటిమలా? పచ్చి కూరగాయలు తిన్నా, జ్యూస్‌ తాగినా..

Feb 4 2023 4:30 PM | Updated on Feb 4 2023 5:55 PM

Beauty Tips: Rose Water Aloe Vera Gel For Acne Free Face - Sakshi

ముఖంపై మొటిమలతో ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే, ఈ చిట్కాలు మీకోసమే..
►ముఖంపై మొటిమలు ఉంటే రోజ్‌ వాటర్, అలోవెరా జెల్‌ కలిపి రాసుకోండి.
►టీస్పూన్‌ అలోవెరా జెల్‌ను స్పూన్‌ రోజ్‌ వాటర్‌లో కలిపి మీ ముఖానికి ప్యాక్‌లా వేయాలి.
►అరగంట తరువాత, ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి.
►కలబందను ముఖానికి రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం ద్వారా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు.

ముఖ సౌందర్యం కోసం..
►ముఖ సౌందర్యానికి రోజూ పచ్చి కూరగాయలు తినాలి.
►లేదా పచ్చి కూరగాయల జ్యూస్‌ తాగినా అద్భుతంగా పనిచేస్తుంది.
►కూరగాయలతో జ్యూస్‌ చేసుకుని తీసుకోవడం వల్ల  అందంగా తయారవుతారు. 
►పసుపు, చందనం కలిపి తరచూ ముఖానికి మసాజ్‌ చేయటం కూడా అందాన్ని రెట్టింపు చేస్తుంది.
►స్నానం చేసే సమయంలో లేదంటే మామూలుగా అయినా వీటిని శరీరానికి రాసుకోవటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 

చదవండి: Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా..
రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్‌ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement