ప్లాటినం బాడీ మసాజర్‌.. అందంతో పాటు ఆరోగ్యం కూడా | Sakshi
Sakshi News home page

ప్లాటినం బాడీ మసాజర్‌.. అందంతో పాటు ఆరోగ్యం కూడా

Published Fri, Aug 11 2023 4:45 PM

This Is The Beauty Massager Which Helps For Health Also - Sakshi

అందం, ఆరోగ్యం రెండింటినీ అందించే డివైస్‌లకు ఈ రోజుల్లో గిరాకీ ఎక్కువ. చిత్రంలోని ఈ మసాజర్‌  బ్యూటీ ప్రొడక్ట్‌తో పాటు హెల్త్‌ టూల్‌ కూడా. ఈ డ్యూయల్‌ రోలర్‌ ప్లాటినం బాడీ మసాజర్‌.. రెండు రోలర్‌లను కలిగి ఉంటుంది. ఈ రోలర్స్‌ను పక్కపక్కనే ఉంచుకుని వినియోగించుకోవచ్చు లేదా ‘వి’ షేప్‌లా మార్చుకుని కూడా ఉపయోగించుకోవచ్చు. దాంతో ముఖం, మెడ, నడుము, తొడలు, కాళ్లు, చేతులు ఇలా అన్ని భాగాల్లో మసాజ్‌ చేసుకోవచ్చు.

సాధారణంగా చాలామంది మహిళలు తమ చర్మ సంరక్షణను చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటి వారు రోజుకి కొన్ని నిమిషాల పాటు బాడీ మొత్తాన్ని ఈ మసాజర్‌తో మసాజ్‌ చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది.  కండరాల్లో ఉత్తేజం కలిగించడానికి, ముడతలు, నొప్పులు పోగొట్టడానికి ఈ పరికరం బాగా ఉపయోగపడుతుంది. చర్మం కూడా కాంతిమంతమవుతుంది. దీనికి చార్జింగ్‌తో పని లేదు.

ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ఈ సెట్‌ని జాగ్రత్త చేయడానికి ప్రత్యేకమైన పర్స్‌తో పాటు.. రోలర్‌ని శుభ్రం చేయడానికి మెత్తటి క్లాత్‌ కూడా లభిస్తుంది.అల్యూమినియం, స్టెయిన్‌లెస్‌ స్టీల్, ప్లాటినం పౌడర్, జర్మేనియం పౌడర్‌ వంటి మెటీరియల్స్‌తో రూపొందిన ఈ టూల్‌ నాణ్యమైనది.. మన్నికైనది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల చర్మం తేజోవంతమవుతుంది. బాడీ ఎనర్జిటిక్‌గా మారుతుంది. బాగుంది కదూ! 

Advertisement
 
Advertisement