టీడీపీ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్‌పై దాడి చేస్తే చర్యలు ఉండవా.. దెందులూరు ఎమ్మెల్యే తో పాటు 100 మంది అనుచరులు దాడి చేసి దౌర్జన్యం చేస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు. మీకొక న్యాయం.. ఎదుట వాళ్లకు మరో న్యాయమా? రెడ్‌బుక్ అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లోకేష్ వ్యవస్థలను విచ్ఛిన్నం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో మద్యం, మట్టి మాఫియా అరాచకం కొనసాగుతోంది. నియోజకవర్గంలో భయానక పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
–కొఠారు అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే


