ఇంటర్‌ చదువుకొనేదెలా! | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ చదువుకొనేదెలా!

Jun 15 2026 1:05 AM | Updated on Jun 15 2026 1:05 AM

నిబంధనలు పాటించకుంటే చర్యలు

న్యూస్‌రీల్‌

కూనరిల్లుతున్న ప్రభుత్వ కాలేజీలు

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

భీమవరం: విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. కళాశాల ఫీజులు, యూనిఫాం, పుస్తకాలు, బస్‌ ఫీజులు వంటివి తడిసిమోపెడవడంతో ఎలా చదివించాలని తలలు పట్టుకుంటున్నారు. విద్య వ్యాపారంగా మారడంతో ఏటా నూతన విద్యాసంస్థలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. భవన నిర్మాణాలు, ప్రభుత్వ అనుమతులు లేకుండానే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తూ అడ్మిషన్స్‌ నిర్వహించడం గమనార్హం. పశ్చిమగోదావరి జిల్లాలో 15 ప్రభుత్వ, రెండు ఎయిడెడ్‌, రెండు సోషల్‌ వె ల్ఫేర్‌, సుమారు 85 ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రస్తుత విద్యాసంవత్సరం మరిన్ని వి ద్యాసంస్థలు పుట్టుకొచ్చాయి. ప్రైవేట్‌ కాలేజీల్లో త గిన వసతులు, ఆటస్థలాలు లేకపోయినా భారీ మొ త్తంలో మాత్రం ఫీజులు వసూలు చేస్తున్నా రు.

ఫీజుల మోత.. తల్లిదండ్రుల వెత : జిల్లాలోని ప్రైవేట్‌ కళాశాలల్లో ఫీజులు పలు రకాలుగా ఉన్నాయి. కళా శాలకు ఉన్న పేరును బట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు. భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణు కు, తాడేపల్లిగూడెం వంటి పట్టణాల్లో పేరున్న కళా శాలలు ఏడాదికి ఫీజు రూపంలో రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. అలాగే హాస్టల్‌కు రూ.లక్ష, బస్‌ చార్జీలు దూరాన్ని బట్టి రూ.30 వేలు, బుక్స్‌కు రూ.18 వేలు, యూనిఫామ్‌ రెండు జతలకు రూ.5 వేలు తీసుకుంటున్నారు. గ్రా మీణ ప్రాంతాల్లోని కళాశాలల్లో ఫీజు రూ.60 వేలు, బస్‌ ఫీజు రూ.18 వేలు, యూనిఫామ్‌ రూ.2,500, బుక్స్‌కు రూ.12 వేల వరకు వసూళ్లు చేస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను చదివించేందుకు అప్పులు చేయాల్సి వస్తోంది. ఫీజుల దోపిడీతో పాటు సెలవు రోజుల్లో సైతం తరగతులు నిర్వహించడం, గైర్హాజరైతే ఫైన్లు, వారానికి ఒక్క రోజు కూడా క్రీడలకు అనుమతించకపోవడం ప్రై వేట్‌ కాలేజీల్లో ప్రత్యేకం.

విద్యాసంవత్సరం ప్రారంభమైనందును ప్రైవేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధలను పాటించకపోతే చర్యలు తప్పవు. అధిక ఫీజు లు వసూళ్లు చేసినా, సెలవు దినాల్లో తరగతు లు నిర్వహించినా చర్యలుంటాయి. తమ పిల్లలను చేర్చే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రైవేట్‌ కళాశాలల గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రభుత్వ కళాశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తాం.

– జి.ప్రభాకరరావు, ఇంటర్మీడియెట్‌

జిల్లా విద్యాశాఖాధికారి, భీమవరం

వామ్మో.. ఫీజులు

ప్రైవేట్‌ కాలేజీల్లో దోపిడీ

ఫీజులు, యూనిఫాం, రవాణా భారం

ఏడాదికి రూ.90 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు ఖర్చు

జిల్లాలోని 85 కళాశాలల్లో ఇష్టారాజ్యం

జిల్లాలోని 15 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో సరైన సదుపాయాలు, ల్యాబ్స్‌, లెక్చరర్లు లేరు. అరకొర వసతులు, అన్ని సబ్జెక్ట్స్‌ బోధించే అధ్యాపకులు లేకపోవడం వల్ల తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వెనుకడుగు వేస్తున్నారు. తప్పనిసరై ప్రైవేట్‌ కాలేజీల్లో చేర్పిస్తున్నారు. ఇదే అదునుగా జిల్లాలోని ప్రధాన పట్టణాలతోపాటు గ్రామాల్లో సైతం ప్రైవేట్‌ కళాశాలలు వెలుస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులతో పాటు బస్‌ ఫీజులు, హాస్టల్‌ ఫీజులతోపాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌, జేఈఈ మె యిన్స్‌, ఎంసెట్‌, నీట్‌ ప్రవేశ పరీక్షలకు శిక్షణ అంటూ అదనంగా దోపిడీ చే స్తున్నారు. ఇలా ఏడాదికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.90 వేల నుంచి రూ.3.50 లక్షల వరకు గుంజుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మనబడి నాడు–నేడు పధకంలో ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను అభివృద్ధి చేశారు. అయితే కూటమి ప్రభుత్వ పాలనలో సర్కారీ కళాశాలలను పట్టించుకోవడం లేదు. సౌకర్యాల కల్పనపై దృష్టి సారించడం లేదు. జిల్లాలో ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖాఽధికారి కార్యాలయానికే అనువైన భవనం లేదంటే కళాశాలల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement