నూజివీడు: లారీని వెనకనుంచి ట్రక్కు వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మీర్జాపురం వద్ద గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నూజివీడు వైపు నుంచి జంక్షన్ వైపు వెళ్తున్న లారీ మీర్జాపురంలో ఆగగా వెనుక నుంచి వచ్చిన గేదెల ట్రక్కు లారీని వెనుకభాగంలో వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో అప్పనవీడుకు చెందిన ట్రక్కు డ్రైవర్ కచ్చా బాల వెంకట సాయి(21), కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు చెందిన గేదెల వ్యాపారి గుమ్మడి కోటేశ్వరరావు(43) అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు కోటేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నూజివీడు రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


