వరి రైతులను ఆదుకొనేవారేరి? | - | Sakshi
Sakshi News home page

వరి రైతులను ఆదుకొనేవారేరి?

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

ధాన్యం కొనడం లేదని ఆగ్రహం

కళ్లాల వద్ద రైతుల నిరసన

భీమడోలు: కళ్లాల్లోని ధాన్యాన్ని మిల్లులకు తరలించకుండా కాలయాపన చేస్తుండటంపై ఆన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూళ్ల గ్రామంలో కళ్లాల వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. వారం రోజులుగా రేపూమాపూ అంటూ అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిస్తోందని మండిపడ్డారు. కౌలు రైతు లు, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు రైతులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, కౌలు రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ కొర్ని అప్పారావు, జిల్లా కో–కన్వీనర్‌ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పది రోజులుగా రబీ కోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, ఆరుదలకు వచ్చిన పంటను గోనె సంచుల్లో సిద్ధం చేయగా.. తరలించేందుకు లారీలు ఏర్పాటు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. కళ్లాల్లో నెట్టులు కట్టిన ధాన్యం బస్తాలను చూ పుతూ నిరసన తెలిపారు. వారం రోజులుగా అధికారులు కాలయాపన చేస్తున్నారని, వాతావరణంతో ఇబ్బందిపడే పరిస్థితి ఉందన్నారు. పంటను స కాలంలో తరలించకపోతే తీవ్రంగా నష్టపోతామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి లారీలు ఏర్పాటు చేసి కళ్లాల్లోని ధా న్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్‌ చేశారు.రైతు సంఘం నాయకులు అల్లు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

బోనస్‌ ప్రకటించాలి

దెందులూరు: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్‌ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం మండలంలోని పోతునూ రులో పర్యటించి కళ్లాల్లోని ధాన్యాన్ని పరిశీలించారు. పెరిగిన ఉత్పత్తి ఖర్చుల రీత్యా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర రూ.2,369 రైతుకు ఏమాత్రం గిట్టుబాటు కాదన్నారు. కేరళలో మాదిరిగా రూ.900 బోనస్‌ ఇవ్వాలని కోరారు. అలాగే ధాన్యం రవాణాకు వాహనాల ఏర్పాటు, నాణ్యమైన గోనె సంచులు, తూకాలు, తేమశాతం లెక్కింపులో మోసాలు అరికట్టేలా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. రబీలో పీఆర్‌ 126 రకం వరికి బదులు ఇతర రకాలు సాగు చేయమని చెప్పడంతో పది బస్తాలకు పైగా దిగుబడి తేడా వస్తోందని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. అధిక దిగుబడులు వచ్చే విత్తనాలు అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు. రైతు సంఘం మండల అధ్యక్షుడు గండి రాజా, మండల కార్యదర్శి సున్నా వెంకట్రావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement