నాలుగు సంస్థలతో కీలక ఎంఓయూలు | - | Sakshi
Sakshi News home page

నాలుగు సంస్థలతో కీలక ఎంఓయూలు

Apr 10 2026 10:21 AM | Updated on Apr 10 2026 10:21 AM

నాలుగు సంస్థలతో కీలక ఎంఓయూలు రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

తాడేపల్లిగూడెం: డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వ విద్యాలయం ఒకే రోజు నాలుగు ప్రతిష్టాత్మక సంస్థలతో నాలుగు కీలక అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకుందని ఉపకులపతి డాక్టర్‌ కె.ధనుంజయరావు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యాన విశ్వ విద్యాలయం పరిపాలన భవనంలో గురువారం నిర్వహించిన ఎంఓయూల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాలు కేవలం కాగితాలపై సంతకాలతో ఆగిపోకుండా ఆచరణలో గొప్ప ఫలితాలు అందిస్తాయని ఆయన తెలిపారు. నాలుగు ఒప్పందాలు భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), బెంగళూర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ రీసెర్చ్‌ (ఐఐహెచ్‌ఆర్‌)తో కుదుర్చుకున్నామని తెలపారు. ఈ కార్యక్రమంలో ఐఐహెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ తుషార్‌ కాంతి బెహరా, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.మాధవి, డాక్టర్‌ సీహెచ్‌ రూత్‌, డాక్టర్‌ బి.ప్రసన్నకుమార్‌, ఎస్‌.సూర్యకుమారి ప్రేమానందం తదితరులు పాల్గొన్నారు.

పెదపాడు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెదపాడు మండలంలోని తాళ్లమూడిలో చోటు చేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లా నగరం మండలం మెడపల్లి గ్రామానికి చెందిన పేరుమాని ఏడుకొండల రెడ్డి (40) తన టాటా ఇంట్రా వాహనంలో పచ్చిమిర్చి, చిలగడ దుంపల లోడును చీరాల సమీపంలోని చినగంజాం వద్ద లోడు చేసుకుని రాజమండ్రికి బయలుదేరాడు. మార్గమధ్యలో గురువారం తెల్లవారు జామున మూడు గంటల సమయంలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి గ్రామానికి వచ్చేసరికి నిద్రమత్తులో ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో తలకు బలమైన గాయం కావడంతో డ్రైవర్‌ సీట్లోనే ఇరుక్కుపోవడంతో హైవే పెట్రోలింగ్‌ అఽధికారులు బయటకు లాగేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే ఏడుకొండలు రెడ్డి మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై ఆర్‌.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉండి: గ్రామంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని పాములపర్రు గ్రామానికి చెందిన కఠారి శ్రీనివాసులు తన ద్విచక్రవాహనంపై బుధవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో ఉండి గ్రామానికి టిఫిన్‌ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా గ్రామంలోని వెలివర్రు జంక్షన్‌ వద్దకు రాగానే పాములపర్రు వైపు నుంచి ఉండి వైపుగా ఎదురుగా వస్తున్న లారీ అతనిని వేగంగా ఢీ కొట్టింది. దీంతో అతనికి తలతో పాటు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి సోదరుడు అంబులెన్స్‌లో భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి నుంచి అందిన సమాచారం, భార్య దుర్గ ఇచ్చి న ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement