జంగారెడ్డిగూడెం: మనిషిలోని రాక్షసత్వాన్ని నశింపజేసి కోరుకున్న ఫలాలను అందించే దేవుడు మద్ది ఆంజనేయస్వామి అని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించు కోవడం ఎంతో ప్రశాంతతను చేకూర్చిందని, ఇక్క డి అర్చకులు, అధికారులు, ఈ ప్రాంతవాసులు ధన్యులని అన్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్‌వీ చందన ఉన్నా రు. అనంతరం గుర్వాయిగూడెం మానస సరోవర్ విల్లాస్‌లో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సుఖ దుఃఖ సమన్వయం అనే అంశంపై ప్రవచించారు.


