ఏలూరు (టూటౌన్): బాబూ జగ్జీవన్‌రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. ఆదివారం స్థాని క ఓవర్ బ్రిడ్జి వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. సామాజిక సేవ చే స్తూనే కుల నిర్మూలన కోసం ఉద్యమాలు నడిపిన సామాజిక విప్లవ యోధుడిగా జగ్జీవన్‌రా మ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఫుడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రవేశపెట్టి ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కార్మికులు కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. బడుగు,బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ అని కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై.విశ్వమోహన్‌రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు, ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పెద్దాడ వెంకటరమణ, అడబాల రవి, దొడ్డిగర్ల సుభమల్లిక్, కడిమి యోహాను, నల్లిమిల్లి శంకర్, డా.పొలిమేర హరికృష్ణ, మే తర అజయబాబు తదితరులు పాల్గొన్నారు.


