రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం అర్బన్ : రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీఆర్‌పీ ఎస్సై పి అప్పారావు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం నిడదవోలు – నవాబుపాలెం మధ్య మారంపల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 30 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండవచ్చని, మృతుడు గ్రీన్ కలర్ టీషర్టు, నాచురంగు ఫ్యాంటు ధరించి ఉన్నాడన్నారు. వివరాలు తెలిసినవారు 9490617090, 8019157528 నంబర్లలో సంప్రదించాలన్నారు. మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు భద్రపరిచినట్లు ఎస్సై అప్పారావు తెలియజేశారు.


