గోదావరిలో పడి వ్యక్తి మృతి
పెనుగొండ: ఆచంట మండలం కరుగోరుమిల్లి శివారు నెల్లివారి పేటకు చెందిన ఇంజేటి పెద్దిరాజు (58) ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. పెద్దిరాజు బుధవారం పాడి పశువును గోదావరిలో శుభ్రపరచుకోవడానికి వెళ్లాడు. దూడను కడిగే సమయంలో ప్రవాహంలో దూడ వెళ్లిపోతుండడంతో, పట్టుకొనే క్రమంలో గోదావరిలో మునిగిపోయాడు. గ్రామస్తులు పడవలతో గాలింపు చర్యలు చేపట్టగా, భీమలాపురం సమీపంలో పెద్దిరాజు మృతదేహాం లభ్యమైంది. మృతుడు పెద్దిరాజు భార్య ఇటీవలే మృతి చెందింది. వారికి ముగ్గురు కుమారులు సంతానం. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కే వెంకట రమణ తెలిపారు.
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఏలూరు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ పరిధిలోని పాండురంగ థియేటర్ సమీపంలో బెనర్జీపేట పంట కాలువలో సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై బ్లూ గడి లుంగీ, కట్ బనియన్‌తో నీటిపై తేలియాడుతూ ఉండగా ఏలూరు వన్‌టౌన్ పోలీసులు బయటకు తీశారు. వివరాలు తెలిసిన వారు ఏలూరు వన్‌టౌన్ సీఐ సత్యనారాయణను సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు.
గోదావరిలో పడి వ్యక్తి మృతి


