కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి | - | Sakshi
Sakshi News home page

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

Nov 6 2025 7:56 AM | Updated on Nov 6 2025 8:04 AM

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

పట్టిసంలో లక్షపత్రి పూజ

భీమవరం(ప్రకాశం చౌక్‌): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచారామ క్షేత్రాలు భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దన స్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. భీమవరంలోని ఉమాసోమేశ్వరస్వామికి నిర్విరామంగా రుద్రాభిషేకాలు, పంచారామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో పూజాధికాలు, సాయంత్రం లక్షపత్రి పూజలు చేశారు. స్వామిని డ్రైప్రూట్స్‌తో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో కొలువైన జనార్దనస్వామి, పార్వతీదేవి, అన్నపూర్ణదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఆలయ ఈఓ డి.రామకృష్ణంరాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

స్ఫటిక లింగాన్ని దర్శించిన భక్తులు

తాడేపల్లిగూడెం రూరల్‌: మండలంలోని వీరంపాలెం బాలాత్రిపుర సుందరీ పీఠం ఆవరణలో స్ఫటిక లింగ దర్శనానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో ఆత్మలింగేశ్వరునికి (స్ఫటిక లింగం) 12 నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. విశ్వేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, హోమాలు, జ్యోతిర్లింగ సహిత లక్ష దీపార్చన కార్యక్రమాలు జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పీఠం ప్రతినిధులు ఈమని శశికుమార్‌, సందీప్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

నేత్రపర్వం.. జ్వాలాతోరణం

ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం రాత్రి జ్వాలాతోరణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వరిగడ్డితో తయారు చేసిన తోరణాన్ని వెలిగించి, దాని కింద నుంచి శివదేవుని వాహనాన్ని ప్రదక్షిణలు చేయించారు. ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయంలో గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవ మూర్తులను పల్లకి వాహనంలో ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి దంపతులు, డీఈఓ భద్రాజీ, ఏఈఓలు మెట్టపల్లి దుర్గారావు, పి.నటరాజారావు ప్రత్యేక పూజలు జరిపి, జ్వాలా తోరణాన్ని వెలిగించారు. భక్తులు, ఆలయ సిబ్బంది తోరణం లోపలి నుంచి శివదేవుని వాహనంతో పాటు ప్రదక్షిణలు చేశారు. వెలిగించిన తోరణం నుంచి వచ్చిన భస్మాన్ని పంట పొలాల్లో వేస్తే పాడి పంటలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. దాంతో ఆ భస్మాన్ని పొందేదుందుకు భక్తులు పోటీపడ్డారు. వేడుక అనంతరం గంగా, పార్వతీ సమేత శివదేవుడు రావణబ్రహ్మ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

వేడుకగా అఖండ జ్యోతి ప్రజ్వలనం

పెనుగొండ : ఆచంటశ్రీఉమా రామేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలన వేడుకగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన అఖండ జ్యోతి మహాశివరాత్రి వరకూ నిరాటంకంగా జ్వలిస్తూ ఉంటుంది. గంధర్వ మహాల్‌కు చెందిన గొడవర్తి వంశీయులు కృత్తికా నక్షత్రహోమం, మండపారాధన, మహా నైవేద్యం, దూప సేవ నిర్వహించి అనంతరం కర్పూర జ్యోతి వెలిగించారు. పది వేల మందికిపైగా భక్తులు కర్పూర జ్యోతిలో పాల్గొనడానికి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కర్పూర జ్యోతి అనంతరం జ్వాలా తోరణం వెలిగించి ప్రభను ఊరేగించారు. ఈఓ ఆదిమూలం వెంకట సత్యనారాయణ, ట్రస్ట్‌ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

భీమవరం ఉమాసోమేశ్వర స్వామి

భీమవరంలో కార్తీక నోములు నోచుకుంటున్న భక్తులు

వీరంపాలెంలో స్ఫటిక లింగం

ద్వారకాతిరుమల శివాలయంలో జ్వాలాతోరణ వేడుక

వేడుకలో పాల్గొన్న భక్తులు

ఆచంట రామేశ్వర స్వామి ఆలయం అఖండ జ్యోతిలో ఆవు నెయ్యి వేస్తున్న భక్తులు

శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు

పంచారామాల్లో ప్రత్యేక పూజలు

ద్వారకాతిరుమలలో జ్వాలాతోరణం వేడుక

వీరంపాలెంలో స్ఫటిక లింగ దర్శనం

ఆచంటలో అఖండ జ్యోతి ప్రజల్వనం

పోలవరం రూరల్‌ : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పట్టిసం శివక్షేత్రంలోని వీరేశ్వరస్వామికి లక్షపత్రి పూజ, భద్రకాళీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పోలవరం గ్రామానికి చెందిన పెంటపాటి లలితాదేవి కుటుంబసభ్యుల సహకారంతో అర్చకులు పూజాధికాలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులను నది దాటించేందుకు 2 లాంచీలను ఏర్పాటు చేశారు. పోలవరం ఎస్సై ఎస్‌ఎస్‌ పవన్‌కుమార్‌ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్‌బాబు క్షేత్రం వద్ద, రేవులో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. దేవస్థానం ఈవో సీహెచ్‌ వెంకటలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 1
1/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 2
2/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 3
3/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 4
4/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 5
5/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 6
6/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి 7
7/7

కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement