హడలెత్తించిన మోంథా | - | Sakshi
Sakshi News home page

హడలెత్తించిన మోంథా

Oct 29 2025 7:47 AM | Updated on Oct 29 2025 7:47 AM

హడలెత

హడలెత్తించిన మోంథా

మున్సిపల్‌ కార్మికుల బైక్‌ ర్యాలీ కొండ వాగులు దాటొద్దు : డీఎస్పీ 347.45 అడుగులకు తమ్మిలేరు జలాశయం సహాయక చర్యల్లో పాల్గొనాలి

న్యూస్‌రీల్‌

మున్సిపల్‌ కార్మికుల బైక్‌ ర్యాలీ
సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏలూరులో మంగళవారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. 8లో u
కూటమికి బుద్ధొచ్చేలా ప్రజా ఉద్యమం

బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2025

బుట్టాయగూడెం: తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏజెన్సీలోని కొండవాగులు పొంగే ప్రదేశాలను పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కొండవాగులు పొంగే అవకాశం ఉన్నందున ఎవ్వరూ వాగులు దాటే ప్రయత్నం చెయొద్దని సూచించారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉద్ధృతంగా ప్రవహించే కొండవాగులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై క్రాంతికుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

చింతలపూడి : మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మంగళవారం అధికారులు 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు నెలలుగా పడుతున్న భారీ వర్షాలకు తమ్మిలేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్‌ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చనని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు.

పెనుగొండ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉండడంతో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులు.. కురిసిన వర్షపు జల్లులతో జిల్లా తడిసి ముద్దయ్యింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి తుపాను తీరాన్ని సమీపిస్తుండటంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమీపంలోని బియ్యపుతిప్ప వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం ఆమేరకు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలోని కొల్లేరు, ఉప్పుటేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి జిల్లాలోని అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి.

పునరావాస కేంద్రాలకు 1203 మంది తరలింపు

మోంథా తుఫాన్‌ ప్రభావం జిల్లాలో బలంగా ఉంది. 13 మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రకటించి అక్కడ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకు జిల్లాలో 201.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను తీవ్రత నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జాతీయ రహదారులు సహా జిల్లాలో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 13 మండలాల్లో 29 గ్రామాలు తుపాను ధాటికి నష్టపోయాయని, 1203 మంది 49 పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదని, ఆర్‌అండ్‌బీ రహదారులు 3.5 మీటర్ల మేర ధ్వంసమయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. పునరావాస కేంద్రాల్లో 1122 ఆహార పొట్లాలు, 4500 వాటర్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఇక ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ కై కలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం మణుగూరులో పర్యటించి కొల్లేరు పెద యడ్లగాడి వంతెనను, ఉప్పుటేరును పరిశీలించారు.

అధికారుల ఏర్పాట్లు..

మంగళవారం రాత్రి నర్సాపురం సమీపంలోని బియ్యపుతిప్ప వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో జిల్లాలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నవారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌ రూమ్‌ నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కై కలూరు, ఉంగుటూరు, నూజివీడుకు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను పంపారు. జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉన్న చెరువుల వద్ద పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. అవసరమైనచోట్ల చెరువులకు గండికొట్టేలా ఆదేశాలిచ్చారు.

బుట్టాయగూడెం: దేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని ప్రజా ఉద్యమం కూటమి ప్రభుత్వంలో మొదలైందని వైఎస్సార్‌సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని కోయరాజమండ్రి పంచాయతీ మెట్టగూడెంలో మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ కాలం నుంచి 2019 వరకు కేవలం 12 మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్ళ జగనన్న పాలనలో కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కేవలం రెండేళ్లలోనే 17 మెడికల్‌ కాలేజీలను తీసుకువచ్చి అందులో 7 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్ల దశకు తీసుకువచ్చారని చెప్పారు. మిగిలిన 10 మెడికల్‌ కాలేజీలు వివిధ దశల్లో పూర్తయ్యాయని తెలిపారు. వీటి పనులు పూర్తవ్వడానికి కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ కళాశాలలు పూర్తయితే పేదలందరికీ మెరుగైన వైద్యం అందడంతో పాటు పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించగలరని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఈ కళాశాలల పనులు చేపట్టడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, వైఎస్సార్‌సీపీ నాయకులు బానోతు బాబూరావు, బానోతు కృష్ణనాయక్‌, కుర్సం ప్రసాద్‌, తెల్లం రాజు పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు

మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు

తుపాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు, వర్షాలు

అనేక మండలాల్లో నేలకొరిగిన చెట్లు

వేలాది ఎకరాల్లో వరి, మినుముకు అపార నష్టం

ప్రమాదకర స్థాయిలో ఉప్పుటేరు, కొల్లేరు ప్రవాహం

13 మండలాల్లో కొనసాగుతున్న హై అలెర్ట్‌

భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన వైనం

తుపాను ప్రభావంతో నేడు విద్యా సంస్థలకు సెలవు

జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్‌ సరఫరా నిలిపివేత

హడలెత్తించిన మోంథా1
1/5

హడలెత్తించిన మోంథా

హడలెత్తించిన మోంథా2
2/5

హడలెత్తించిన మోంథా

హడలెత్తించిన మోంథా3
3/5

హడలెత్తించిన మోంథా

హడలెత్తించిన మోంథా4
4/5

హడలెత్తించిన మోంథా

హడలెత్తించిన మోంథా5
5/5

హడలెత్తించిన మోంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement