సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): విపత్తు నిర్వహణ విధుల్లో అధికారులు సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలసి అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. మండలాల వారీగా అధికారులతో తుపాను ప్రభావం, పునరావాస కేంద్రాల నిర్వహణ, రక్షణ ఏర్పాట్లు వంటి అంశాలపై సమీక్షించారు. తుపాను తీరం దాటే సమయంలో విపరీతమైన వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఫోన్ కాల్స్‌కి స్పందించి సహాయ కార్యక్రమాలను అందించాలని చెప్పారు.


