మోంథా గుబులు
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా మోంథా తుపా ను గుబులు నెలకొంది. జిల్లాపై తీవ్ర ప్రభావం ఉండనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి సాగు, 2.75 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్యాఇ. ముఖ్యంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జిల్లాలో వరి చేలు ఈనిక, పొట్ట, కోత దశల్లో ఉన్నాయి. ఈనిక, పొట్ట దశల్లో ఉన్న చేలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యాన పంటల్లో బొప్పాయి, అరటి, కూరగాయల సాగుపై తుపాను ప్రభావం ఉంటుంది. జిల్లాలో 980 ఎకరాల్లో కూరగాయలు, 300 ఎకరాల్లో బొప్పాయి, 3,500 ఎకరాల్లో అరటి సాగవుతున్నాయి. తీవ్ర గాలులకు బొప్పాయి, అరటి పంటలు నేలవాలే ప్రమాదం ఉంది.
కంట్రోల్ రూమ్‌ల ఏర్పాటు
తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్ రూములు ఏర్పా టు చేశారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. గంటకు 120 కి.మీ. వేగంతో గా లులు వీచే అవకాశం ఉన్నందుకు హోర్డింగ్‌లు, వి ద్యుత్ స్తంభాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోదావరిలోకి పర్యాటక లాంచీలను నిలిపేశారు. 9491041419, 18002331077 నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం జిల్లా లోని కలెక్టరేట్, డివిజినల్, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)ను రద్దు చేశారు.
నేడు, రేపు పాఠశాలలకు సెలవు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని యజమాన్యాల్లోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పోలవరం రూరల్: తుపాను ప్రభావంతో పట్టిసీమ శివక్షేత్రంలో రేవులో తిరిగే లాంచీలను మూడు రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్టు డీ ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. అలాగే పోలవరం, పురుషోత్తపట్నం ప్రయాణికులను దాటించే ఫెర్నీ లాంచీ రాకపోకలు కూడా నిలుపుదల చేశామన్నారు. కాగా ఆ దివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రాగా వారు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేశారు. సీఐ బాల సురేష్, ఎస్సై పవన్‌కుమార్ ఉన్నారు.
కలెక్టర్ వెట్రిసెల్వి
కై కలూరు/మండవల్లి: తుపాను నేపథ్యంలో కొల్లే రు పరీవాహక ప్రాంతాల ప్రజలు పడవ ప్రయా ణాలు చేయవద్దని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతు న్న కలిదిండి మండలంలో ఆదివారం ఆమె పర్యటించారు. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన వద్ద నీటిమట్టాన్ని పరిశీలించారు. కొల్లేరులో నీటి ఉధృతి కారణంగా మునిగిన పెనుమాకలంక రహదారిని పరిశీలించారు. మూడు రోజులపాటు ఎవరూ పడవ ప్రయాణాలు చేయవద్దని సూచించారు. రాకపోకలు స్తంభించిన కొల్లేరు గ్రామాలకు సోమవారం నుంచి రేషన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లేరు, ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లవద్దన్నారు. ఏటా వర్షాలకు పెనుమాకలంక రోడ్డు మునుగుతుందని కొల్లేరులంక గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలిదిండిలో లాల్వ డ్రెయిన్‌పై కూలిన వంతెనను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక వంతెనపై రాకపోకలకు అనుమతించవద్దన్నారు. కలిదిండి మండలం వెంకటాపురం, కై కలూరు మండలం వరహాపట్నం నూతన రహదారులపై నీరు నిల్వ ఉన్నా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్టీవో అచ్చుత అంబరీష్, డ్రెయినేజీ డీఈ ఎం.రామకృష్ణ, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, సీఐ రవికుమార్, తహసీల్దార్లు ఉన్నారు.
రైతుల గుండెల్లో తుపాను
తీవ్ర ఆందోళనలో వరి రైతులు
120 కి.మీ వేగంతో
తీవ్రగాలులు వీచే అవకాశం
అధికారులు అప్రమత్తం
నేడు, రేపు పాఠశాలలకు సెలవు
నేటి పీజీఆర్‌ఎస్ రద్దు
మోంథా గుబులు
మోంథా గుబులు


