రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటాం
ఏలూరు (మెట్రో): జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులకు యూనియన్ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని జిల్లా రెవెన్యూ అధ్యక్షులు కె.రమేష్‌కుమార్ అన్నారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ భవనంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికలో అధ్యక్ష కార్యదర్శులుగా కె.రమేష్‌కుమార్, ఎ.ప్రమోద్‌కుమార్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా జి.విజయకుమార్‌రాజు, ఉపాధ్యక్షులుగా కె.చల్లన్నదొర, కె.రవిచంద్రరావు, ఎం.సోమేశ్వరరావు, పి.మాధవి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సీహెచ్ యస్వంత్, క్రీడా కార్యదర్శిగా బి.సందీప్, జాయింట్ సెక్రటరీలుగా సీహెచ్ స్వామి, జె.శ్రీనునాయక్, పి.నాజీమబేగమ్, ఎమ్.మల్లిఖార్జునరావు, ట్రెజరర్‌గా ఆర్‌వీ రాజేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా టి.రాజరత్నకుమార్, కె.నరసింరావు, స్టేట్ కౌన్సిలర్‌గా శేఖర్‌బాబు ఎన్నికయ్యారు.


