విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు

Oct 27 2025 8:18 AM | Updated on Oct 27 2025 8:18 AM

విద్య

విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు

విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు హాస్టల్‌ ప్రాంగణం పూడ్చివేత ప్రైవేటుకని వెళ్లి.. పరలోకాలకు.. ప్రత్యేక పర్యవేక్షణ అధికారి రాక

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం 71 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన విద్యుత్‌ ఉద్యోగుల సంఘం (327) తన పోరాటాలను కొనసాగిస్తోందని ఆ సంఘ ఈపీడీసీఎల్‌ డిస్కం అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు నాయక్‌ అన్నారు. ఏలూరులోని జిల్లా విద్యుత్‌ స్టోర్‌ వద్ద ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (327) ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఉమ్మడి ఉద్యమాల్లో భాగస్వామ్య సంఘాలతో కలిసి విద్యుత్‌ జేఏసీగా ఏర్పాటు చేసుకుని విద్యుత్‌ ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్నామన్నారు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, జేఎల్‌ఎం గ్రేడ్‌–2 లను సంస్థలో విలీనం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి వి. రాము, ఏలూరు డివిజన్‌ అధ్యక్షుడు పి.శ్రీనివాస్‌, కార్యదర్శి జి.నాగేశ్వరరావు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌.శ్రీనివాస్‌ నిర్మల్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు: ఆకివీడు పెదపేటలోని బీసీ హాస్టల్‌ ప్రాంగణాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేస్తున్నా రు. హాస్టల్‌ ప్రాంగణం లోతట్టుగా ఉండటంతో వర్షానికి, డ్రెయినేజీలో నీరు ప్రాంగణంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ‘దుక్కి వర్షానికే హాస్ట ల్‌ ప్రాంగణం ముంపు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రాంగణాన్ని మట్టితో పూడ్చుతున్నారు.

లారీ ఢీకొని బాలుడు మృతి

ఆకివీడు: అమ్మా.. ప్రైవేటుకు వెళ్లివస్తానంటూ సైకిల్‌పై బ్యాగ్‌ తగిలించుకుని వెళ్లిన బా లుడు లారీ ఢీకొని దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం గుమ్ములూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మల్లా వీరన్న కుమారుడు మోనేష్‌ శ్రీసాయి (11) సైకిల్‌పై ప్రైవేటుకు వెళుతుండగా గ్రామంలోని ప్రధాన సెంటర్‌లో గణపవరం వైపు వెళుతున్న రొయ్యల లోడు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో శ్రీసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలు అక్కడకు చేరుకున్నారు. వీరన్నకు ఏకై క కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఆకివీడులోని ప్రైవేట్‌ స్కూల్‌లో చదివిస్తున్నారు. ఏఎస్సై స త్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. లారీని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ వేగంగా రావడంతో అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి.ప్రసన్న వెంకటేష్‌ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో కలెక్టర్‌ నాగరాణి, జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డితో సమావేశమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముందస్తు చర్యలపై సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏదైనా సమాచారాన్ని 8639541520 నంబర్‌లో సంప్రదించి ప్రత్యేకాధికారికి తెలియజేయవచ్చు. జిల్లాలోని 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని, అత్యవసర పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచి నట్టు కలెక్టర్‌ తెలిపారు. చెట్లను నరకడానికి 12 బృందాలతో 24 మందిని నియమించామన్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు 1
1/1

విద్యుత్‌ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement