
కారులో చెలరేగిన మంటలు
ఏలూరు టౌన్: ఏలూరు అమీనాపేటలో మంగళవారం రాత్రి ఒక కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతి అయ్యింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మంచినీళ్ళతోట ప్రాంతానికి చెందిన కురెళ్ళ సుబ్బారావుకి చెందిన కారులో మంగళవారం రాత్రి 8.15 గంటలకు యజమాని కుమారుడు వివేక్ ప్రయాణిస్తున్నాడు. అశోక్‌నగర్ వైపు నుంచి కారులో వెళుతూ ఉండగా అమీనాపేట సోనోవిజన్ షోరూమ్ సమీపానికి వచ్చే సరికి కారు ఇంజన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన వెంటనే కారులో నుంచి కిందికి దిగి పక్కకు వెళ్లిపోయారు. స్థానికులు మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఏలూరు అగ్నిమాపక అధికారి రామకృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాలేదు. కారు ఇంజన్ భాగం దగ్ధమైంది. అగ్నిమాపకశాఖ ప్రమాదనష్టాన్ని అంచనా వేస్తున్నారు.