
ఏసీబీ వలలో సబ్ ట్రెజరీ ఉద్యోగి
కై కలూరు: రిటైర్డ్ అటెండర్‌కు రావాల్సిన సొ మ్ములకు లంచం డిమాండ్ చేసిన కై కలూరు సబ్ ట్రెజరీ సీనియర్ అసిస్టెంట్ కులుకులూరి హనుమంతరావు అలియాస్ ఆంజనేయులను శనివారం ఏలూరు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. కై కలూరుకు చెందిన షేక్ సుభానీ 2016లో రెవెన్యూ అటెండర్‌గా రిటైరు కాగా శాలరీ ఫిక్స్ కాలేదు. ఇటీవల ఏలూరు ప్రధాన కార్యాలయం నుంచి కై కలూరు సబ్ ట్రెజరీకి ఆయన ఫైల్‌ను క్లియర్ చేసి పంపారు. ఏరియర్స్, గ్రాట్యూటీ కలిపి రూ.33 లక్షలు రావాల్సి ఉండగా.. కై కలూరు నుంచి ఫైల్ తిరిగి పంపడానికి సుభానీ మూ డు నెలలుగా హనుమంతురావు చుట్టూ తిరుగుతున్నారు. రూ.66 వేలు లంచం ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్ చేయగా సుభానీ బతిమలాడితే రూ.55 వేలకు ఫైనల్ చేశాడు. జూన్ 26న రూ.10 వేలు ఇవ్వగా.. ఈనెల 2న సుభానీ ఖాతాలో పదవీ విరమణ లబ్ధి కొంత జమైంది. ఇంకా రూ.6 లక్షలు రావాల్సి ఉండగా.. ఆ మొత్తం కోసం రూ.20 వేలు లంచం ఇప్పుడు ఇచ్చి మిగిలింది తర్వాత ఇవ్వాలన్నాడు. దీనిపై ఈనెల 17న సుభానీ ఏలూరు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు పథకం ప్రకారం రూ.20 వేలను సుభానీకి ఇచ్చి పంపగా.. ఈ సొమ్మును తీసుకుండుగా హనుమంతరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ చెప్పారు. ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు బాలకృష్ణ, శ్రీనివాసు, వాసుకృష్ణ, సతీష్ పాల్గొన్నారు.