
200 రోజులకు పెంచాలి
ఉపాధి హామీలో పనిదినాలు 100 రోజుల నుంచి 200 రోజులకు పెంచాలి. సుప్రీంకోర్టు చెప్పినట్లు కనీస వేతనం రూ.600 ఇవ్వాలి. పని ప్రదేశాలలో మౌలిక సౌకర్యాలు కల్పించాలి. పనిముట్లు, మెడికల్ కిట్లు, మజ్జిగ, టెంట్, మంచినీరు వంటివి ఏర్పాటు చేయాలి. పనికి తగ్గ వేతనం సక్రమంగా ఇవ్వాలి.
పీవీ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం
అప్పులు చేసి బతకాల్సి వస్తోంది
మే నుంచి కూలి డబ్బులు అందలేదు. రోజువారీ కూలి పనులు చేస్తేనే మా కుటుంబ పోషణ గడిచేది. రెండు నెలలుగా ఉపాధి కూలీ డబ్బులు అందకపోవడంతో అప్పులు చేసి బతకాల్సి వస్తోంది. ఒక ప్రక్క వ్యవసాయ పనులు లేవు. మరో పక్క పూర్తి స్థాయిలో ఉపాధి పనులు కల్పించడం లేదు.
బుద్దుల గంగాభవానీ,
ఉపాధి కూలీ, టి.నర్సాపురం
మూడు నెలలుగా డబ్బులు అందలేదు
ఇప్పటికీ మూడు నెలలుగా ఉపాధి కూలీ సొమ్ములు అందలేదు. దీంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణకు ఇబ్బంది ఏర్పడుతుంది. కుటుంబ జీవనం చాలా ఇబ్బందిగా తయారైంది. ఏడాదికి వంద రోజులు పనులు కల్పిస్తామని హామీ ఇచ్చినా క్షేత్ర స్థాయిలో దాన్ని అమలు చేయడం లేదు. ఇప్పటికై నా పాలకులు దయతలచి వేతన బకాయిలను తక్షణం చెల్లించాలి.
ఉడతా వెంకటేష్, ఉపాధి కూలీ, బుట్టాయగూడెం
కనీస వేతనం ఇవ్వడం లేదు
ఉపాధి హామీ కూలీలకు కనీస వేతనం రోజుకు రూ.307 చెల్లించాలనే నిబంధన ఉన్నా కొల్లేరు ప్రాంతంలోని ఉపాధి కూలీలకు రోజుకు రూ.150 నుంచి రూ.200 మాత్రమే ఉపాధి వేతనాలు చెల్లిస్తున్నారు. పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. ప్రతి 15 రోజులుకు వేతనాలు చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు.
చిన్నం మాధవ, వనదుర్రు, ముదినేపల్లి మండలం

200 రోజులకు పెంచాలి

200 రోజులకు పెంచాలి

200 రోజులకు పెంచాలి