
వర్జీనియా రైతును ఆదుకోవాలి
వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలి. కౌలు ధరలు, ఉత్పత్తి వ్యయాలు గణనీయంగా పెరిగాయి. దీంతో రైతులకు నష్టం వస్తోంది. గత ఏడాది మాదిరిగా రూ.300 పైబడి సరాసరి ధర వస్తే వర్జీనియా రైతు గట్టెక్కుతాడు. లేకుంటే అప్పుల తిప్పలు తప్పవు.
– ఘంటశాల గాంధీ, రైతు సంఘం నాయకుడు
లో–గ్రేడ్‌కు మంచి ధర రావాలి
లో–గ్రేడ్, మీడియం గ్రేడ్‌కు మంచి ధర ఇవ్వాలి. లో–గ్రేడ్‌ను కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. దీంతో రైతు నష్టపోతున్నాడు. సరాసరి ధర మంచిగా లేకపోతే వర్జీనియా రైతు నష్టాల్లో కూరుకుపోతాడు. అప్పుల నుంచి బయటపడాలంటే గత ఏడాది సమీపానికై నా ధరలు ఉండాలి.
– వామిశెట్టి హరిబాబు, రైతు సంఘం నాయకుడు
●

వర్జీనియా రైతును ఆదుకోవాలి