
భార్యపై భర్త హత్యాయత్నం
పాలకొల్లు సెంట్రల్: అర్ధరాత్రి నిద్రిస్తున్న భార్యపై భర్త కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని అర్థకట్ల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాళ్లబండి వెంకటేశ్వర్లు భార్య వెంకటరమణ కొంతకాలంగా కుటుంబ కలహాలతో గొడవపడుతున్నారు. శనివారం కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అర్ధరాత్రి సమయంలో భార్య వెంకటరమణ నిద్రిస్తుండగా భర్త వెంకటేశ్వర్లు వచ్చి తలుపు కొట్టాడు. లేచి తలుపు తీయగా ఆమె మెడపై వెంకటేశ్వర్లు కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వెంటనే వచ్చి పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని నరసాపురం డీఎస్పీ శ్రీవేద పర్యవేక్షించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాలకొల్లు రూరల్ ఎస్సై బి సురేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.