
డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ
దెందులూరు: వ్యవసాయ రంగంలో యాంత్రికరణ వేగంగా వృద్ధి చెందుతుంది. ఇటీవల డ్రోన్ల ద్వారా పంట చేలకు ఎరువులను వేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో డిప్లమో ఇన్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ సర్వీసెస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ (దిశి) కార్యక్రమం ద్వారా జిల్లాలో రైతులకు, ఎరువుల వర్తకులకు శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటల యాజమాన్య పద్ధతులు, డ్రోన్ల వినియోగం, ఎరువులను సకాలంలో వాడకం గురించి శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ ద్వారా పంట పెట్టుబడి తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ హబీబ్ భాష వ్యవసాయ శాఖ అధికారులు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు.
ప్రతిభ చూపుతున్న అభ్యర్థులు
దిశి శిక్షణ భాగంగా 2023– 24 సంవత్సరానికి గ్రూపులకు సంబంధించిన కొన్ని రోజులు వనరులు సమకూర్చి వ్యాపారస్తులకు కంపెనీ క్షేత్ర పరిశీలకులకు శిక్షణ అందిస్తున్నారు. వారిలో తొమ్మిదో తరగతి ఉత్తీర్ణత అయిన వారికి డైరెక్టర్ ఆత్మ ద్వారా ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేస్తున్నారు. గ్రూపులకు సంబంధించి పరీక్షకు హాజరైన వారిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ముగ్గురు డిస్టింక్షన్‌లో నిలిచారు. రైతులు, వ్యాపారులు శాసీ్త్రయ పరిజ్ఞానంతో పాటు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందడమే లక్ష్యంగా ఈ శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేక శిక్షణ
దిశి శిక్షణలో ఒక బ్యాచ్‌కి 48 క్లాసులు ఉంటాయి. 40 థియరీ క్లాసులు, 8 ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి బ్యాచ్‌కు ఒక ఫెసిలిటేటర్‌ను కేటాయించి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం.
– హబీబ్ బాషా, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ

డ్రోన్ల వినియోగంపై రైతులకు శిక్షణ