
మధ్యవర్తిత్వంపై అవగాహన
జీవితాలతో చెలగాటం
అగ్నిమాపక అధికారుల నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రమాదా లను అదుపు చేసే వాహనాలు, సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 8లో u
ఏలూరు (టూటౌన్): కక్షిదారులు మధ్యవర్తిత్వంపై అవగాహన పెంచుకోవాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి సూచించారు. గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో కక్షిదారులకు మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారం అనే అంశంపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా కేసుల పరిష్కారంపై అవగాహన కల్పించేలా వారం పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా కోర్టు ప్రాంగణం నుంచి ‘వన్–కే’ వాక్ కార్యక్రమం నిర్వహించనున్నామన్నారు. న్యాయ మూర్తులు, న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు, పోలీస్ సిబ్బంది, ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు, సిబ్బంది పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు.