
నేటి నుంచి ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పర్యటన
ఏలూరు(మెట్రో): స్వచ్చ సర్వేక్షణ్‌లో భాగంగా జిల్లాలో ఉత్తమ గ్రామాలను ఎంపిక చేసే కార్యక్రమానికి కేంద్ర అకాడమీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ బృందాలు శుక్రవారం నుంచి పర్యటించనున్నా యని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జిల్లా అధికారులతో కేంద్ర బృంద సభ్యుల స్టేట్ నోడల్ కో–ఆర్డినేటర్ ఎస్.సందీప్, జిల్లా కో–ఆర్డినేటర్ పి.సత్తిబాబు కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. రోజుకి రెండు గ్రామాల చొప్పున 36 గ్రామాల్లో బృందం పర్యటించనుంది. సర్వేలో భాగంగా ప్రజాభిప్రాయాల సేకరణ, మరుగుదొడ్ల వినియోగం, పంచాయతీ, పాఠశాల, అంగన్‌వాడీ, సచివాలయాలు, మార్కెట్ యార్డ్స్, డ్రైనేజ్ వ్యవస్థ, చెత్త సేకరణ డంపింగ్ యార్డ్స్ తరలింపు, ప్లాస్టిక్ నిషేధం, వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై సమాచారం సేకరిస్తారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ త్రినాథ్‌బాబు, డీపీఓ కె.అనురాధ ఉన్నారు.