రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలి

Jun 11 2025 9:10 AM | Updated on Jun 11 2025 9:10 AM

రేణుకాచౌదరిపై  చర్యలు తీసుకోవాలి

రేణుకాచౌదరిపై చర్యలు తీసుకోవాలి

పెనుమంట్ర: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ రేణుకాచౌదరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను పెనుమంట్ర జెడ్పీటీసీ సభ్యురాలు కర్రి గౌరీ సుభాషిణి తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆమె మార్టేరు లో ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. వైఎస్‌ జగన్‌పై వ్యక్తిగత కక్షతో మాతృమూర్తులు తలదించుకునే వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఈ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో మంది తల్లులను రెచ్చగొట్టి వారి బిడ్డలను చంపించే ప్రయత్నం చేస్తున్న రేణుకపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న అకృత్యాలు చూసి సహించలేని పరిస్థితి నెలకొందని, ఒక తల్లిగా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సహించరాని విషయం అన్నారు.

చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడి అరెస్టు

ఆకివీడు: స్థానిక సంతపేటలోని పడాల వారి వీధిలో ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన వృద్ధుడు షేక్‌ మీరాను మంగళవారం చెరుకువాడ ప్రాంతంలో అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు ఆకివీడు రూరల్‌ సీఐ జగదీశ్వరరావు చెప్పారు. నిందితుడిని భీమవరంలోని కోర్టుకు హాజరుపరచగా ఈ నెల 23వ తేదీ వరకూ రిమాండ్‌ విధించినట్లు తెలిపారు. అతనిపై కిడ్నాప్‌, అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసులు నమోదు చేసిన విషయం విదితమే. కేసును భీమవరం డీఎస్పీ జయసూర్య దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement