విక్టర్‌బాబుపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

విక్టర్‌బాబుపై పీడీ యాక్ట్‌

Jun 6 2025 6:07 AM | Updated on Jun 6 2025 6:07 AM

విక్ట

విక్టర్‌బాబుపై పీడీ యాక్ట్‌

భీమవరం : చట్టాన్ని ఉల్లంఘిస్తూ ప్రజాశాంతికి విఘాతం కలిగిస్తున్న భీమవరం పట్టణం చిన అప్పారావుతోటకు చెందిన కొత్తపల్లి విక్టర్‌బాబుపై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి చెప్పారు. గురువారం భీమవరం వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విక్టర్‌బాబు భీమవరం వన్‌టౌన్‌, టూటౌన్‌, కాళ్ల, ఉండి పోలీసుస్టేషన్లలో వివిధ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో అతడిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి ముందుస్తు నేర నియంత్రణ చర్యలో భాగంగా రాజమహేంద్రవరం జైలుకు పంపించినట్లు ఎస్పీ తెలిపారు.

ఫర్నిచర్‌ షాపులో అగ్నిప్రమాదం

ఎగసిపడిన అగ్నికీలలు.. భారీ ఆస్తి నష్టం

ఏలూరు టౌన్‌ : ఏలూరు రూరల్‌ ప్రాంతంలోని ఒక ఫర్నిచర్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు చెబుతున్నారు. వివరాల ప్రకారం.. ఏలూరు బీడీ కాలనీ ప్రాంతానికి చెందిన మాదాబత్తుల వెంకటేష్‌ ఏలూరు రూరల్‌ పరిధిలో జేఎంజే స్కూల్‌ సమీపంలో గణేష్‌ సోఫా అండ్‌ ఫర్నిచర్‌ వర్క్స్‌ పేరుతో దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఫర్నిచర్‌ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు ఎగసిపడడంతో దుకాణంలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్‌ ఇంజన్లతో అతికష్టం మీద రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపు చేశారు. ఆస్తి నష్టం అంచనా వేసేందుకు రాత్రివేళ కావటంతో ఆలస్యం అవుతుందని, భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోందని అగ్నిమాపక శాఖ ఏలూరు అధికారి రామకృష్ణ తెలిపారు.

ఆస్తి తగాదాలో కత్తులతో ఇరువర్గాల దాడి

ఏలూరు టౌన్‌: అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాల్లో తీవ్ర వివాదం నెలకొనటంతో ఇరు వర్గాలు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. గాయాలపాలైనవారు ఏలూరు సర్వజన ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఈ ఘర్షణపై ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలు ఫిర్యాదులు చేశారు. శ్రీపర్రు గురకలపేట ప్రాంతానికి చెందిన మండేల గంగరాజు అతని సోదరుడు మండేల రవీంద్రబాబుకు మధ్య ఆస్తి తగాదా ఉంది. ఈ నేపథ్యంలో గురువారం ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ గొడవల్లో గంగరాజు, గంటసాల కుమారస్వామి, గంటసాల పెద్దిరాజు గాయపడగా, రెండవ వర్గం రవీంద్రబాబు, మండల రామరాజుకు గాయాలయ్యాయి. ఏలూరు రూరల్‌ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విక్టర్‌బాబుపై పీడీ యాక్ట్‌ 1
1/1

విక్టర్‌బాబుపై పీడీ యాక్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement