
ఎంటర్‌ప్రెన్యూర్‌లు దేశాభివృద్ధికి అవసరం
నూజివీడు: విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఎంటర్‌ప్రెన్యూర్‌షి ప్ విద్యపై నిర్వహిస్తున్న ఐదు రోజుల ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ఎంతో దోహదపడుతుందని ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్ పేర్కొన్నారు. స్థానిక ట్రిపుల్ ఐటీలో ఆర్జీయూకేటీ, వాధ్వానీ ఫౌండేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు ట్రిపుల్ ఐటీల నుంచి ఎంపిక చేసిన 49 మంది అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉద్యోగులుగా తీర్చిదిద్దే బదులుగా వారినే వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దినట్లయితే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రతి విద్యార్థి స్టార్ట్‌అప్ ప్రారంభించేలా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్యవక్తగా హాజరైన నవీన్ అహ్మద్ మాట్లాడుతూ ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులు విద్యార్థుల్లా నేర్చుకొని తరువాత విద్యార్థులకు శిక్షణనివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ ఈఐపీటీ పీ శ్యామ్, ఏఓ బీ లక్ష్మణరావు, సుజాత, ఫైనాన్స్ ఆఫీసర్లు నాగార్జునాదేవి, శ్రీనాఽథ్ డీన్ అకడమిక్స్ చిరంజీవి, డీన్ ఎవాల్యూషన్ రియాజ్‌హుస్సేన్ పాల్గొన్నారు.