ఘనంగా భగీరథ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా భగీరథ జయంతి

May 5 2025 8:36 AM | Updated on May 5 2025 7:24 PM

ఘనంగా

ఘనంగా భగీరథ జయంతి

ఏలూరు(మెట్రో) : లక్ష్య నిర్దేశంతో చేసే ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించవచ్చని భగీరథ మహర్షి నిరూపించారని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అన్నారు. ఆదివారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ జయంతి వేడుకలు నిర్వహించారు. భగీరథుని చిత్రపటానికి కలెక్టర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నీటిని దివి నుంచి భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని అన్నారు. మహనీయుల గొప్పతనాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, సహాయ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ టి.వెంకటేశ్వర్లు, కలెక్టరేట్‌ ఏఓ నాంచారయ్య, కలెక్టరేట్‌ బీసీ సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

విద్యుత్‌ అధికారులకు పదోన్నతులు, బదిలీలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈపీడీసీఎల్‌ ఏలూరు ఆపరేషన్‌ సర్కిల్‌లో పలువురు అధికారులకు పదోన్నతులు, బదిలీలు చేస్తూ సంస్థ సీఎండీ పృధ్వీతేజ్‌ ఇమ్మడి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏలూరులో టెక్నికల్‌/ఎంఆర్‌టీ విభాగంలో ఏఈఈగా పనిచేస్తున్న ఎన్‌.ఉషారాణికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి కల్పించి ఆమెను ఏలూరులోనే ఎల్‌టీఎం అండ్‌ ఎస్‌పీఎం విభాగానికి బదిలీ చేశారు. ఏలూరు ఎల్‌టీఎం అండ్‌ ఎస్‌పీఎం విభాగంలో డిప్యూ టీ ఈఈగా పనిచేస్తున్న కె.రమేష్‌ను జీలుగుమిల్లి ఆపరేషన్‌ డిప్యూటీ ఈఈగా బదిలీ చేశా రు. జీలుగుమిల్లి ఆపరేషన్‌ డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎన్‌.పద్మినిని అనకాపల్లి ప్రొటెక్షన్‌ విభాగానికి బదిలీ చేశారు.

సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల కట్టడి

ఆగిరిపల్లి : గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాలు, చోరీలను అరికట్టవచ్చని డీఎస్సీ కేఎన్‌వీ ప్రసాద్‌ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆదివారం వ్యాపారస్తులకు సీసీ కెమెరాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. డీఎస్పీ మాట్లాడుతూ జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు తప్పకుండా సీసీ కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దుకాణాల ముందు వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా, ట్రాఫిక్‌కు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. ఎస్సై శుభశేఖర్‌, ఆగిరిపల్లి మర్చంట్స్‌ చాంబర్‌ అసోసియేషన్‌ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు లక్ష్యం పెంపు

దెందులూరు/భీమడోలు: జిల్లాలో రైతుల విజ్ఞప్తి మేరకు ధాన్యం సేకరణ లక్ష్యాన్ని 2.50 లక్షల టన్నులకు పెంచినట్టు జాయింట్‌ కలెక్టర్‌ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. దెందులూరు మండలంలోని కొవ్వలి, భీమడోలు మండలంలోని పోలసానిపల్లి జాతీయ రహదారిపై ఆరబెట్టిన ధా న్యాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్లు పెంచేందుకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రైతులెవరూ ఆందోళన చెందవద్దని, ధాన్యం కొనుగోలుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. జిల్లాలో రైతులకు 51,32,300 గోనె సంచులను సరఫరా చేసి 2.05 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతుల కోరిక మేరకు పెంచిన లక్ష్యానికి అనుగుణంగా 0.45 లక్షల టన్నులకు గాను 11.25 లక్షల సంచులు అవసరం కాగా 8,95,410 సంచులు అందుబాటు లో ఉంచామన్నారు. పెంచిన లక్ష్యానికి అనుగుణంగా సిబ్బంది ట్రక్‌ షీట్‌ నమోదు చేసి రైస్‌ మిల్లులకు పంపాలని ఆదేశించారు. జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ పి.శివరామమూర్తి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి హబీబ్‌ బాషా, జిల్లా సహకార అధికారి శ్రీనివాస్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి వై.భాను ప్రతాప్‌ రెడ్డి ఉన్నారు.

ఘనంగా భగీరథ జయంతి 1
1/2

ఘనంగా భగీరథ జయంతి

ఘనంగా భగీరథ జయంతి 2
2/2

ఘనంగా భగీరథ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement