
● బొండం కొట్టండి ప్లీజ్!
నాకో కొబ్బరి బొండం కొట్టండి.. అంటూ భక్తులు ట్రాక్టర్ వద్ద ఎగబడ్డారు. చింతలపూడికి చెందిన జల్లిపల్లి రామకృష్ణ, సులోచన దంపతులు వారి పెళ్లిరోజు సందర్భంగా ఆదివారం భక్తుల కోసం 1,600 కొబ్బరి బొండాలు ట్రాక్టర్‌లో తీసుకొచ్చారు. వాటిని ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలోని శ్రీహరి కళాతోరణ వేదిక వద్ద భక్తులకు పంపిణీ చేశారు. కొబ్బరి బొండాలు కొట్టివ్వడం ప్రహసనంగా మారింది. ఈ క్రమంలోనే బొండాలు అందుకున్న భక్తులు నాకో బొండం కొట్టివ్వండి అంటూ ట్రాక్టర్ వద్ద ఎగబడ్డారు.
–ద్వారకాతిరుమల