
ఆర్మీ ఆఫీసర్ లక్ష్యం
ఎన్‌సీసీలో చేరడంతో నాలో చాలా మార్పు వచ్చింది. జీవితంలో ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఏర్పడింది. భవిష్యత్‌లో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటున్నాను.
– కె సంపత్‌సాయి, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం
దేశానికి సేవ చేయాలి
ఎరోనాటికల్ ఇంజనీర్ అయ్యి దేశానికి సేవలు అందించాలని ఆశపడుతున్నాను. తల్లిదండ్రులు, మా ఎన్‌సీసీ అధికారులు చాలా ప్రోత్సహిస్తున్నారు.
– ఎం ప్రభాకర్, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్, భీమవరం
గన్ ఫైరింగ్ బాగా నచ్చింది
నా ధ్యేయం ఐపీఎస్ ఆఫీసర్. ఎన్‌సీసీలో నాకు ఫైరింగ్ బాగా నచ్చింది. దేశానికి సేవ చేయాలని ఆశగా ఉంది. ఎన్‌సీసీ కుటుంబం అన్ని రకాలుగా నాకు అండగా ఉంది.
– బి నాగనిఖిల, బీబీఏ ద్వితీయ సంవత్సరం, సెయింట్ ఽథెరిస్సా, ఏలూరు
ధైర్యంగా జీవించేలా శిక్షణ
ఈ ఎన్‌సీసీలో ఒక అమ్మాయి ధైర్యంగా సమాజంలో ఎలా రాణించాలో నేర్చుకున్నాను. ఆర్మీలో డిఫెన్స్ సర్వీస్‌లో సేవలు అందించాలని అనుకుంటున్నాను. ఆర్మీ మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందని గ్రహించాను.
– బి సమృద్ధి, ఇంటర్ ద్వితీయ సంవత్సరం, సర్ సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్
●

ఆర్మీ ఆఫీసర్ లక్ష్యం

ఆర్మీ ఆఫీసర్ లక్ష్యం

ఆర్మీ ఆఫీసర్ లక్ష్యం