
మంచి ధర వచ్చేలా కృషి చేస్తాం
పొగాకు బోర్డు రైతులకు మంచి రేటు వచ్చేలా కృషిచేస్తుంది. ఈ ఏడాది కూడా ఆశించిన మేరకు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రైతులు పంటను బయటకు అమ్ముకోవద్దు. ఈ ఏడాది బ్రెజిల్, జింబాబ్వే దేశాల్లో పెద్దఎత్తున పంట పండించారు. గట్టి పోటీ ఉన్న పరిస్థితుల్లో ధర విషయంలో కొంత ఒడిదొడుకులు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది వచ్చిన విధంగానే సరాసరి వచ్చేలా కృషిచేస్తాం. కర్నాటకలో ఆక్షన్ పూర్తి కాగానే, ఇక్కడ ధర పెరిగే అవకాశం ఉంది.
– సీహెచ్ యశ్వంత్‌కుమార్, చైర్మన్ , వర్జీనియా పొగాకు బోర్డు