
కోకో కొనుగోలు కోసం ధర్నాలు
ఏలూరు (టూటౌన్): కోకో గింజలు కొనుగోలు చేయాలని, అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 24, 25 తేదీల్లో మండలాల్లో ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించనున్నట్టు కోకో రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ, కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. చొదిమెళ్లలో నాయకులు శనివారం పర్యటించారు. ధర్నా, రాస్తారోకోలను జయప్రదం చేయాలని రైతులను కోరారు. కోకో గింజల కొనుగోలు, ధరల సమస్యలపై ఉద్యాన శాఖ రాష్ట్ర డైరెక్టర్ సమక్షంలో చర్చలు జరిగినా కోకో రైతులకు న్యాయం జరగలేదన్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. సంఘ
బదిలీలు, పదోన్నతుల చట్టం ఏకపక్షం
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అవమానించడమే అని వైఎస్‌ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ పాయింట్ ఏడాదికి ఒకటి కావాలని అడిగినా 0.5 మాత్రమే కేటాయించడం అన్యాయమన్నారు. రిటైర్మెంట్‌కు మూడేళ్ల సర్వీస్ ఉన్నవారికి బదిలీల నుంచి మినహాయించాలని కోరినా అధికారులు రెండేళ్లు ఉన్నవారికి మాత్రమే మి నహాయింపు ఇచ్చారన్నారు. జీఓ 117 రద్దుతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు దాదాపు 10 వేలు మిగులు చూపుతారని, అలాంటప్పుడు ఎస్జీటీలకు పదోన్న తులు ఎక్కడ కల్పిస్తారని ప్రశ్నించారు. పలు ప్రాథమిక పాఠశాలల మూతకు రంగం సిద్ధమైందని, భవిష్యత్తులో ఎస్జీటీ టీచర్ల నియామకం కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 117 రద్దుతో అపకారమే ఎక్కువగా జరుగుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం
ఏలూరు(మెట్రో): జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పథంలో నిలిపి, యువతకు ఉద్యోగా వకాశాల కల్పనకు ప్రాధాన్యమివ్వాలని ఎంపీ పుట్టా మహేష్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో శనివారం జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో పరిశ్రమలకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు వివరాలు సేకరించాలని, వచ్చేఏడాది మార్చిలోపు 7 వేల యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, జేసీ పి.ధాత్రిరెడ్డి, ఎమ్మెల్యేలు చింతమనేని ప్ర భాకర్, సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు.
నిధుల దుర్వినియోగంపై విచారణ
ఉంగుటూరు: కాగుపాడు గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రెండోసారి శనివారం విచారణ జరిగింది. నూజివీడు డీఎల్‌పీఓ కార్యాలయంలో డీఎల్‌పీఓ విచారణ చేయగా ఆరోపణలకు బాధ్యులు సర్పంచ్ కడియాల సుదీష్ణ, కార్యదర్శి, దుర్గాధర్, పూర్వ కార్యదర్శులు బాలకృష్ణ, శ్రీదేవి, ఆరోపణలు చేసిన వార్డు సభ్యులు హాజరయ్యారు. కార్యదర్శి బాలకృష్ణ రూ.1.42 లక్షలు, కార్యదర్శి శ్రీదేవి రూ.6.35 లక్షలు, సర్పంచి సుదీష్ణ రూ.7.77 లక్షల నిధులు దుర్వినియోగం చేసినట్టు నోటీసులో తెలిపారు.
టెన్త్ పరీక్షలకు 4,399 మంది హాజరు
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో శనివారం జరిగిన పదో తరగతి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–1 సంస్కృతం పరీక్షలకు 4,398 మంది రెగ్యులర్ విద్యార్థులకు 4,388 మంది హాజరయ్యారు. ఒకసారి ఫెయిలైన వారిలో 18 మందికి 11 మంది హాజరయ్యారు. జిల్లాలోని 40 కేంద్రాలను అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చే సినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు.
రుణాల దరఖాస్తులకు గడువు పెంపు
ఏలూరు (టూటౌన్): జిల్లాలో స్వయం ఉపాధి రుణాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును ఈనెల 25 వరకు పొడిగించినట్టు బీసీ కార్పొరేషన్ ఈడీ ఎన్.పుష్పలత తెలిపారు. అభ్యర్థుల వయోపరిమితిని 50 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచారన్నారు. అధికారులు ఈ మేరకు దర ఖాస్తులు స్వీకరించాలన్నారు.