
అంబేడ్కర్ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ,
తాడేపల్లిగూడెం అర్బన్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడ నడిబొడ్డున రూ.480 కోట్లతో అంబేడ్కర్ స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఇది తమ ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి మంత్రి కొట్టు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం దేశ ప్రజలకు రక్షణ కవచంగా నిలిచిందన్నారు. 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారని, బేస్‌మెంట్ భాగంలో మరో 80 అడుగుల పీఠంతో 205 అడుగుల్లో దేశంలోనే ఎత్తయిన విగ్రహం ఏర్పాటు చేయనున్నారన్నారు. 2014లో చంద్రబాబు హయాంలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు కేటాయించిన ఐదెకరాల స్థలం నిరుపయోగంగా మారిందన్నారు.