
కలిదిండి మండలం భాస్కరరావుపేట ఉన్నత పాఠశాల నుంచి ఎంపికై న విద్యార్థులు
కై కలూరు: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా తరఫున గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. ఈ పోటీలలో రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు కై కలూరు నియోజకవర్గం నుంచి పలువురు ఎంపికయ్యారు. ఆయా పాఠశాలల్లో ఎంపికై న క్రీడాకారులు, వ్యాయోయ ఉపాధ్యాయులను హెచ్‌ఎంలు గురువారం సన్మానించారు. కలిదిండి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఎస్.హర్షవర్థిని(అండర్ – 14), కె.శృతి(అండర్ – 17), అండర్ – 14 విభాగంలో భాస్కరరావుపేట ఉన్నత పాఠశాలకు చెందిన సీహెచ్.సుధాధనలక్ష్మీ, అండర్ – 17 విభాగంలో జె.ప్రసన్న రాణి, పి.మౌనిక, ఎస్.చరిష్మా, మండవల్లి మండలం చింతపాడు ఉన్నత పాఠశాల నుంచి అండర్ – 17 విభాగంలో ఎం.భానుచందర్, జె.మంజుభగవాన్ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ఉమ్మడి కృష్ణాజిల్లా తరఫున ఎంపికయ్యారు. ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు స్వర్ణకుమారి, కె.పాండురంగారావు, కెఎస్‌ఎస్‌ఎస్.ఆంజనేయులు, పీడీలు ఏ.మావుళ్ళేశ్వరరావు, బి.కృష్ణకుమారి, కె.రత్నదాసు, డి.సుబ్బారావు, రవిబాబు, పాఠశాల అభివృద్థి కమిటీ చైర్మన్లు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.