
రావిపాడులో అందాల పోటీలో పాల్గొన్న ఓ లేగదూడను పరిశీలిస్తున్న అధికారులు
పెంటపాడు: పాడి పశువులను లాభసాటిగా పెంచేందుకు రైతులు అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్యనిర్వహణాధికారి డాక్టర్ జేసురత్నం అన్నారు. రావిపాడులో మంగళవారం లేగదూడల ప్రదర్శన, అందాల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దూడల సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చే వ్యాధులు, పాడిగేదెలకు మేత అంశాలను పశుసంవర్ధక శాఖ డీడీ నరసింహరావు తెలిపారు. సర్పంచ్‌ల చాంబర్ అధ్యక్షులు పెన్నాడ సూరిబాబు, సొసైటీ అధ్యక్షులు దేవ వెంకటరమణ, ఎంపీటీసీ సభ్యులు తాతారావు, ఉప సర్పంచ్ బుల్లబ్బాయి, కోరిమిల్లి పశువైద్యులు డాక్టర్ క్రాంతి పాల్గొన్నారు. పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను నిర్వాహకులు అందించారు.