
వట్టి వెంకట రంగ పార్థసారథి (ఫైల్)
భీమడోలు: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల శాసనమండలి మాజీ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నేత వట్టి వెంకట రంగ పార్థసారథి (92) కన్నుమూశారు. విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో వారం రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. పూళ్ల పంచాయతీ శివారు ఎంఎంపురం గ్రామంలోని సొంత వ్యవసాయ క్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో సోమవారం అంత్యక్రియలు జరిగాయి. పార్థసారథి చిన్న కుమారుడు, మాజీ మంత్రి వసంతకుమార్ గత జనవరిలో మృతిచెందగా ఆయన మానసికంగా కుంగిపోయారు. పార్థసారథి వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. డీసీసీబీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.