
బయోఫేజ్–వి మందును విడుదల చేస్తున్న దృశ్యం
సాక్షి, భీమవరం: రొయ్యల చెరువుల్లో విబ్రియో సమస్యకు చక్కటి పరిష్కారానికి బయోమేడ్ సంస్థ తయారుచేసిన బయోఫేజ్–వి దోహదపడుతుందని ఆ సంస్థ ఎండీ పి.కృష్ణంరాజు తెలిపారు. సోమవారం బయోఫేజ్ మందును భీమవరంలో విడుదల చేసిన సందర్భంగా ఆక్వా రైతులు, మందుల డీలర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రొయ్యలకు వ్యాపించే విబ్రియో సమస్యతో రైతులు సతమతమవుతున్నారని, దీనిని అధిగమించడానికి సంస్థ బయోఫేజ్–వి మందును తయారుచేసి తొలిసారిగా భీమవరంలో ఆవిష్కరించామన్నారు. ఫేజెస్ టెక్నాలజీతో తయారుచేసిన బయోఫేజ్–వి విబ్రియో సమస్యకు చక్కటి పరిష్కారమన్నారు. తెగుళ్ల నివారణపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తమ సంస్థ రైతులకు మేలు చేసేలా మందులు తయారు చేస్తున్నట్టు చెప్పారు. శాప్ ప్రెసిడెంట్ ఎస్.కృష్ణ, టెక్నికల్ డైరెక్టర్ దుర్గాప్రసాద్, జూనియర్ ఎండీ కార్తీక్, మార్కెటింగ్ హెడ్ బీడీఎం ఎం.లక్ష్మీనారాయణ, రొయ్యల రైతులు, డీలర్లు పాల్గొన్నారు.