
స్పందనలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న ఎస్పీ
జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ
ఏలూరు టౌన్ : జిల్లాలో ప్రజల సమస్యలపై సత్వరమే స్పందిస్తూ బాధితులకు న్యాయం చేసే దిశగా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందనలో భాగంగా పలువురి నుంచి ఆయన వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఎస్పీ ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్పందనలో అర్జీలను పూర్తిస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ ధరించాలన్నారు. ట్రైనీ ఐఏఎస్ అధికారి అపూర్వ భరత్ పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చిన లింకులు ఓపెన్ చేయటంతో తన బ్యాంకు ఖాతా నుంచి రూ.81,998 మాయమయ్యాయని, సైబర్‌సెల్‌కు ఫిర్యాదు చేసినా డబ్బులు తిరిగి రాలేదని కై కలూ రుకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు.
● తన భర్త వ్యసనాలకు బానిసై బంగారం, డబ్బు తీసుకుని వెళ్లిపోయాడని, అతడిపై చర్యలు తీసుకోవాలని చింతలపూడిలో ఏఎన్‌ఎంగా పనిచేస్తున్న మహిళ వినతిపత్రం అందించారు.
● ఓ వ్యక్తి తన నుంచి వ్యాపారం కోసం రూ.21 లక్షలు తీసుకున్నాడని, సొమ్ములు అడిగితే ఇబ్బందులు పెడుతున్నాడని ఏలూరుకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశారు.
● తాను గతంలో జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకుని, తిరిగి చెల్లించానని, అయినా రుణం ఉందని చాటింపు వేయించిన వారిపై చర్యలు తీసుకోవాలని తడికలపూడికి చెందిన వ్యక్తి కోరారు.