ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం ఇంటర్మీడియెట్ విద్యార్థులకు గణితం పేపర్–1ఏ, బోటనీ–1, సివిక్స్–1 పరీక్షలు జరిగాయి. 106 కేంద్రాల్లో 37,912 మంది విద్యార్థులకు 35,870 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరు జిల్లాలో 39 కేంద్రాల్లో 12,267 మంది జనరల్ విద్యార్థులకు 11,676 మంది, 2,074 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,742 మంది హాజరయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో 52 కేంద్రాల్లో 16,502 మంది జనరల్ విద్యార్థులకు 15,891 మంది, 1,730 మంది ఒకేషనల్ విద్యార్థులకు 1,517 మంది హాజరయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో 15 కేంద్రాల్లో 4,456 మంది జనరల్ విద్యార్థులకు 4,279 మంది, 883 ఒకేషనల్ విద్యార్థులకు 765 మంది హాజరయ్యారు. మొత్తంగా 95 శాతం హాజరు నమోదైంది. జంగారెడ్డిగూడెంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్ష రాస్తున్న జంగారెడ్డిగూడెం శబరి ఒకేషనల్ కళాశాలకు చెందిన విద్యార్థి మాల్‌ప్రాక్టీస్ చేస్తూ పట్ట్టుబడ్డాడని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.చంద్రశేఖర బాబు తెలిపారు.
9న భగవద్గీత పోటీలు
భీమవరం (ప్రకాశం చౌక్): ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ అధ్వర్యంలో వచ్చేనెల 9న జిల్లాస్థాయి భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహిస్తామని ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు తెలిపారు. ఆనంద అష్టోత్తర శత భగవద్గీతలోని 108 శ్లోకాల పోటీలను సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 94403 42699, 98491 33457 నంబర్లలో సంప్రదించాలని కోరారు.