బాలికలదే పైచేయి | - | Sakshi
Sakshi News home page

బాలికలదే పైచేయి

May 1 2026 5:51 AM | Updated on May 1 2026 5:51 AM

పది ఫలితాల్లో జిల్లాకు 9వ స్థానం

88.49 శాతం ఉత్తీర్ణత నమోదు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పదవ తరగతి పరీక్షా ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. జిల్లాలో బాలికలు పై చేయిగా నిలిచారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బాలికలు ఉత్తీర్ణతలో ముందంజలో నిలిచారు. 2022 నుంచి 2026 వరకు అన్ని సంవత్సరాల్లో బాలికల పాస్‌ శాతం బాలుర కంటే ఎక్కువగా ఉంది. ఈ ఏడాది పది ఫలితాల్లో జిల్లా 88.49 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 9వ స్థానాన్ని దక్కించుకుంది. కొన్నేళ్లుగా క్రమంగా మెరుగవుతున్న ఫలితాలు ఈసారి కూడా కొనసాగడం విశేషం. జిల్లాలో పదవ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి 138 కేంద్రాల్లో నిర్వహించారు. ఈ పరీక్షలకు మొత్తం 23,884 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో బాలురు 12,183 మందికి 10,605 మంది పాసై 87.5 శాతం, బాలికలు 11, 701 మందికి 10,529 మంది పాసై 89.98 ఉత్తీర్ణత శాతం నమోదు చేశారు. గత ఏడాది జిల్లా 6వ స్థానంలో ఉండగా, ఈసారి 9 వ స్థానానికి తగ్గింది. అయినప్పటికీ ఉత్తీర్ణత శాతం పెరగడం సానుకూల అంశంగా విద్యాశాఖాధికారులు భావిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మరింత మెరుగైన ర్యాంక్‌ సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సాక్షి ముందుగానే ఈ ఏడాది ఫలితాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. అదే విధంగా ఈసారి కూడా ఉత్తీర్ణత శాతం పెరిగింది.

పాఠశాలల వారీగా..

మేనేజ్‌మెంట్‌ పరీక్షకు పాసైన ఉత్తీర్ణత

సంఖ్య హాజరైన వారు

వారు

ప్రభుత్వ పాఠశాలలు 12 674 536 79.53 శాతం

జడ్‌పీ 155 9,582 7,779 81.18

మునిసిపల్‌ 16 1,428 1,083 75.84

ఎయిడెడ్‌ 10 659 507 76.93

ఏపీఆర్‌ఈఐ 01 75 75 100

ఏపీఎస్‌డబ్ల్యూ 05 377 351 93.10

టిడబ్ల్యుఏ 01 37 32 86.49

బీసీడబ్ల్యూ 04 149 148 99.33

ప్రైవేట్‌ 196 10,903 10,625 97.45

జిల్లాలో ఐదేళ్ల పది ఫలితాల శాతం ఇలా...

2022 : 60.98

2023 : 70.32

2024 : 83.20

2025 : 87.99

2026 : 88.49

Advertisement
 
Advertisement
Advertisement