ఏకగ్రీవంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎన్నిక
అంబాజీపేట: జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలకు ముక్కామల జెడ్పీ హైస్కూల్ విద్యార్థి జి.దినేష్‌ప్రసాద్ ఎంపికై నట్టు హెచ్‌ఎం ఎం.శ్రీహరిప్రసాద్ తెలిపారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రాజాంలో జరిగిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో సబ్ జూనియర్స్ 74 కేజీల విభాగంలో దినేష్ ప్రసాద్ ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడన్నారు. త్వరలో అమలాపురంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటాడన్నారు. దినేష్‌ప్రసాద్‌తో పాటు తర్ఫీదు నిచ్చిన పీడీ ముత్యాల పవన్‌కిషోర్‌ను డీఈవో పి.నాగేశ్వరరావు, డీవైఈఓలు కాండ్రేగుల వెంకటేశ్వరరావు, పి.రామలక్ష్మణమూర్తి, డ్రిస్టిక్ట్ ఎగ్జామినేషన్ సెక్రటరీ బి.హనుమంతరావు అభినందించారు.
పాత నేరస్తుడికి రిమాండ్
దేవరపల్లి: కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్న పాత నేరస్తుడు రామరాజుకు న్యాయమూర్తి గురువారం రిమాండ్ విధించారు. దేవరపల్లి సీఐ బీఎన్ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం డివిజన్‌లోని లక్కవరానికి చెందిన ఎండ్రగుత్తి రామరాజు(గంగరాజు) 2019లో దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటి దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యాడు. అనంతరం జైలు నుంచి బైయిల్‌పై వచ్చిన అతడు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో కొవ్వూరు రెండవ అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఇటీవల అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దేవరపల్లి ఎస్సై పి.మనోహర్, సిబ్బందితో కలిసి గురువారం లక్కవరంలో రామరాజును పట్టుకుని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.
అమలాపురం టౌన్: కోనసీమ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు నూతన కార్యవర్గం ఏర్పాటైంది. స్థానిక ఆఫీసర్స్ రిక్రియేషన్ క్లబ్‌లో గురువారం జరిగిన జిల్లా సాధారణ సమావేశం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఎన్నికల అధికారిగా కుడుపూడి త్రినాథ్ వ్యవహరించారు. జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పప్పుల శ్రీరామచంద్రమూర్తి. ఏపీ ఎఫ్‌ఏ ఎన్నికల అబ్జర్వర్ జీఎస్‌ఎస్ పవన్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు జరిగాయి. జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎం.రంగారావు, ఉపాధ్యక్షుడిగా నరేంద్రకుమార్, కార్యదర్శిగా రాయుడు సత్యరాజు, సహాయ కార్యదర్శిగా టి.మమత, కోశాధికారిగా వైఎన్‌వీ కుమార్, గౌరవాధ్యక్షురాలిగా పెచ్చెట్టి విజయలక్ష్మి, గౌరవ చైర్మన్‌గా వై.సాయి వెంకట రమణారావు, సభ్యులుగా సీహెచ్. ప్రశాంత్, సూసై స్టీవెన్‌కుమార్, ఎస్.అక్షయ్‌రెడ్డి ఎన్నికయ్యారు.


