ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్‌ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Apr 9 2026 7:35 AM | Updated on Apr 9 2026 7:35 AM

కాజులూరు: కాకినాడ–కోటిపల్లి రహదారిలో కాజులూరు మండలం గొల్లపాలెం శలపాక జంక్షన్‌ వద్ద బుధవారం ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొని కరప మండలం గొర్రిపూడికి చెందిన గండి ఏసురత్నం (50) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఏసురత్నం కూరగాయల వ్యాపారి. బుధవారం ఉదయం తన మోటారు సైకిల్‌పై కురగాయలు విక్రయానికి వెళ్తుండగా హైదరాబాద్‌ నుంచి వస్తున్న అంజనా ట్రావెల్స్‌ బస్సు అతనిని ఢీకొంది. ఈ ఘటనలో ఏసురత్నంకు తీవ్ర గాయాలయ్యయి. స్థానికులు 108లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గొల్లపాలెం పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, బస్సును స్టేషన్‌కు తరలించారు. కాగా ఏసురత్నం చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. అతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement