రాయవరం: మండలంలోని వెదురుపాక విజయదుర్గా పీఠంలో మంగళవారం విజయదుర్గా వైభవం పుస్తకాన్ని పీఠాధిపతి వాడ్రేవు వెంకటసుబ్రహ్మణ్యం(గాడ్) ఆవిష్కరించారు. పిఠాపురం గ్రామానికి చెందిన కోట శ్రీను(దత్తశ్రీను) రచించిన పుస్తకాన్ని గాడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తక రయయిత దత్తశ్రీను మాట్లాడుతూ పీఠంతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించారు. కార్యక్రమంలో పీఠం అడ్మినిస్ట్రేటర్ వీవీ బాపిరాజు, విజయదుర్గా సేవా సమితి ప్రతినిధులు గాదె భాస్కరనారాయణ, సత్యవెంకటకామేశ్వరి, బలిజేపల్లి రమ, పెదపాటి సత్యకనకదుర్గ, బుజ్జి, పీఠం పీఆర్వో వేణుగోపాల్ పాల్గొన్నారు.


