ఎన్నాళ్లీ ఆందోళనకర్రం | - | Sakshi
Sakshi News home page

ఎన్నాళ్లీ ఆందోళనకర్రం

Apr 4 2026 7:43 AM | Updated on Apr 4 2026 7:43 AM

అడ్డతీగల మండలం డి.భీమవరం వద్ద వంకాయల కాలువపై నలభై ఏళ్ల కిందట నిర్మించిన వంతెన శిథిలమైంది. ఈ వంతెనపై రెండు చోట్ల గుంతలు పడ్డాయి. ఇక్కడ అనేక ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలే గోతుల్లో ఇలా కర్రలు నిలిపి వస్త్రాన్ని పెట్టి ఉంచారు. ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్వగ్రామం అనంతగిరికి వెళ్లేందుకు ఇదే ప్రధాన మార్గమైనా కనీసం పట్టించుకోవడం లేదు. అడ్డతీగల మండలంలో 30, రాజవొమ్మంగి మండలంలో పది గ్రామాలకు ఇదే దారి కావడం గమనార్హం.

–అడ్డతీగల

ఆవునండి భలే!

పాశర్లపూడికి చెందిన ఆదర్శ రైతు ఉప్పే బాలాజీ పెంచుతున్న రాజస్థాన్‌ రాఠీ జాతికి చెందిన ఆవు ఆకట్టుకుంటోంది. శరీరంపై అందమైన మచ్చలతో ప్రత్యేకంగా కనిపిస్తున్న ఈ ఆవు రోజుకు 20 లీటర్ల పాలు ఇస్తోంది. 20 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన ఆవు సంతానంగా ఈ పశువు ప్రస్తుతం బాలాజీ కుటుంబానికి ఆదరణగా మారింది.మంచి పాల దిగుబడి ఇస్తున్న ఈ అరుదైన ఆవును ఎంతో మమకారంతో పోషిస్తున్నారు. –మామిడికుదురు

Advertisement
 
Advertisement
Advertisement