ఏడాది కాలంగా కోళ్ల ఫారాలతో తీవ్ర నష్టాల బాట పట్టాం. ప్రస్తుతం గుడ్డు ధర తగ్గటంతో మళ్లీ అదే పరిస్థితి ఏర్పడింది. గుడ్డు ధర రూ.4.05 ఉండటంతో ఏమి చెయ్యాలో తెలియడం లేదు. మేత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి.
– భూపతిరాజు నర్సింహరాజు, ఖండవల్లి
ఆర్థిక ఇబ్బందులు
దాదాపు 15 ఏళ్లగా కోళ్లఫాం నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఆర్థికంగా నలిగిపోయాం. రెండు నెలలు బాగానే ఉన్నా, మళ్లీ గుడ్డు ధర పతనమైంది. ఇలాగే ఉంటే కోళ్ల పరిశ్రమ మూతపడుతుంది.
– మండా తాతారెడ్డి, కోళ్ల రైతు, పిట్టల వేమవరం
ఖండవల్లిలో ఖాళీగా ఉన్న కోళ్లషెడ్లు


